ఇది దేశ హిత బడ్జెట్ – బండి సంజయ్

#image_title #separator_sa #attachment_caption #separator_sa #blog_title

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై బండి సంజయ్ కౌంటర్

PaperDabba News Desk: 23 July 2024

భారతదేశ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలకు స్పందిస్తూ, మోదీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ హిత బడ్జెట్ అన్నారు.

మోదీ విజనరీకి అద్దం పట్టేలా ఉంది

బండి సంజయ్ మాట్లాడుతూ, ఈ బడ్జెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీకి ప్రతిబింబమని, మౌలిక రంగాలకు అత్యధిక నిధులు కేటాయించి దేశ అభివృద్ధికి బాటలు వేసిందని చెప్పారు.

మౌలిక రంగాలకు అత్యధిక నిధులు కేటాయింపు భేష్

మౌలిక సదుపాయాలకు, రోడ్లు, రైల్వే, విమానాశ్రయాలు వంటి రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి, దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్లడానికి ఈ బడ్జెట్ తోడ్పాటును అందిస్తుందని చెప్పారు.

వ్యవసాయం, విద్యకు పెద్దపీట వేశాం

వ్యవసాయం, విద్య రంగాలకు మరింత ప్రాధాన్యతనిచ్చిన ఈ బడ్జెట్, రైతులకు సబ్సిడీలు, విద్యార్థులకు బోధన లో పటిష్టమైన మార్గదర్శకాలను అందించిందని తెలిపారు.

3 కోట్ల మందికి ఇండ్లు నిర్మించేలా బడ్జెట్ ప్రతిపాదనలు

బడ్జెట్ లో 3 కోట్ల మందికి ఇండ్లు నిర్మించేలా ప్రతిపాదనలు ఉంచి, ప్రజల వసతులకు అధిక ప్రాధాన్యతనిచ్చిందని బండి సంజయ్ పేర్కొన్నారు.

నాగలికి రెండు ఎడ్ల మాదిరిగా సమపాళ్లలో అభివ్రుద్ధి, సంక్షేమం

ఈ బడ్జెట్ అభివృద్ధి, సంక్షేమం అన్నిటినీ సమపాళ్లలో కలిపి, దేశానికి నూతన మార్గదర్శకాలను అందిస్తుందని చెప్పారు.

తెలంగాణకు ప్రాధాన్యతనిచ్చాం

తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చామన్న బండి సంజయ్, రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన నిధులు అభివృద్ధి పనులకు వాడుకకు రావాలని సూచించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు తప్పు

తెలంగాణకు నిధులివ్వలేదని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శలు మూర్ఖత్వానికి నిదర్శనమని చెప్పారు. తెలంగాణ సహా వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు.

హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్

హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రీయల్ కారిడార్ లో 210 కి.మీ. తెలంగాణలో భాగం ఉందని, రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ద్వారా వ్యాపార, పరిశ్రమల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు.

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణుల అభిప్రాయం

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని నిపుణులు తేల్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశం పొందుపర్చని విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేయాలని సూచించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విమర్శలు

ఓట్ల కోసం పైసలు పంచుడు, దంచుడు, అప్పుల్లో ముంచుడు తప్ప కాంగ్రెస్, బీఆర్ఎస్ సాధించిందేమిటని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మీ వంకర బుద్ది మారలేదా? అని అన్నారు.

ఇకనైనా తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర సహాయ సహకారాలపై నిర్మాణాత్మక సలహాలివ్వాలని, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ విధానాలను మార్చుకోవాలని బండి సంజయ్ సూచించారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version