విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

శనివారం ఆయన గన్నవరం విమానాశ్రయ విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి, ఎంపీ సీఎం రమేష్, యార్లగడ్డ వెంకట్రావు, సాధారణ పరిపాలన విభాగం ప్రిన్సిపాల్ సెక్రటరీ సురేష్ కుమార్, జేసీ గీతాంజలి శర్మ మరియు ఇతర అధికారులతో ఆయన విమానాశ్రయం విశిష్ట అతిథుల భవనంలో అయిన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భముగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ… విమానాశ్రయ అభివృద్ధి పనులకు తాము అత్యంత ప్రాధాన్యతను ఇచ్చామని, 2025 జూన్ నాటికి మొత్తం పనులు పూర్తి చేయాలనీ, ఆ దిశగానే అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.

అయితే విమశ్రయ అభివృద్ధి పనులకు కావలసిన నిధులు, తగిన మెటీరియల్ అన్ని సిద్ధంగా ఉన్నాప్పటికీ ఆలస్యానికి గల కారణాలపై ఆరా తీశారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పనులు కొంత మేర మందగించాయని, పనులు వేగవంతం చేసి నిర్దేశిత సమయానికి పనులు పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.

ఒక వాట్సాప్ గ్రూప్ రూపొందించి ఎప్పటికప్పుడు జరుగుతున్న పనుల పురోగతిని పోస్టు చేస్తూ తమకు వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. క్రమం తప్పకూడా నెలకు ఒక్కసారి సమీక్షలు జరుపుతానని ఆయన అధికారులకు చెప్పారు.

విమానాశ్రయ విస్తరణలో భాగంగా నెలకొన్న భూ సమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాల్వ పై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులకు సూచించారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version