ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు... రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు ఎల్బీనగర్ వైపు నుంచి, ఇటు మియాపూర్ వైపు నుంచి కూడా భక్తులు అధికంగా వస్తున్నారు. దీనితో మెట్రో స్టేషన్ పరిసరాలు సందడిగా మారాయి. వరసగా రెండు రోజులు సెలవు దినాలు కావడంతో మరింతగా ఖైరతాబాద్ గణేశుడికి మరింత భక్తుల తాకిడి పెరిగింది. దీనితో మెట్రోలో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా చర్యలు తీసుకుంటున్నారు మెట్రో యాజమాన్యం. టికెట్ కౌంటర్, ఎగ్జిట్ గేట్లు వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చెప్పట్టారు. అలాగే క్యూఆర్ కోడ్ టికెట్, కార్డ్ ద్వారా వెళ్లే ప్రయాణికులను వేర్వేరుగా పంపిస్తున్నారు.

స్టేషన్ లోపల ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ద్వారా ముందస్తుగానే టికెట్లు బుక్ చేసుకోవాలని, కార్డులో సరిపడా డబ్బులు లేకపోతే ఎంట్రీ స్టేషన్‌లో రీఛార్జ్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ఉదయం నుంచి గంట గంటకు రద్దీ పెరుగుతుండటంతో మెట్రో యాజమాన్యం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. టికెట్ కౌంటర్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లతోపాటు ఫ్లాట్ ఫాం వద్ద భద్రతా సిబ్బంది ప్రయాణికులకు తగిన సూచనలు చేస్తున్నారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version