జగన్ డ్రామాలను ప్రజలు నమ్మేపరిస్థితి లేదు – మంత్రి కొల్లు రవీంద్ర

#image_title #separator_sa #attachment_caption #separator_sa #blog_title

జగన్ రెడ్డి రాజకీయ నాటకాలు – మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు

వ్యక్తిగత కక్షలు మరియు దౌర్జన్యాలను జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ గనులు, భూగర్భ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. గత ఐదేళ్లుగా పల్నాడు ప్రాంతంలో భయానక పరిస్థితులు సృష్టించింది మీరేనని ప్రజలకు బాగా తెలుసన్నారు.

“జగన్ రెడ్డి రాబందుల కంటే హీనంగా తయారయ్యాడు. శవం ఎక్కడ దొరుకుతుందా, ఎప్పుడు రాజకీయం చేసేద్దామా అనే ఆలోచనే తప్ప ఆయన ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు,” అని రవీంద్ర ఘాటుగా విమర్శించారు.

జగన్ రెడ్డి రాజకీయ అవకాశవాదం

రౌడీ హత్యను రాజకీయ లబ్ధి కోసం వినియోగిస్తున్న జగన్ ని రవీంద్ర అన్నారు. గత ఐదేళ్లలో పల్నాడులో కనబడని వ్యక్తి ఇప్పుడు హత్య జరిగినప్పుడు మాత్రమే ప్రత్యక్షమవడంవిడ్డురంగా ఉందన్నారు. ప్రజల భద్రతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం మీద అభాండాలు వేయడం తప్ప జగన్ రెడ్డికి మరో పని లేకపోయిందన్నారు.

పల్నాడులో జరిగిన పాత దారుణాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి చేసినప్పుడు వైసీపీ సభ్యులు భయానక పరిస్థితులు సృష్టించారు. బీసీ సమాజానికి చెందిన తోట చంద్రయ్యను, కంచర్ల జల్లయ్యను అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఇలాంటి సంఘటనలు పల్నాడులో తరచూ జరిగాయి.ఈ విషయాన్నీ ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు.

“తండ్రి శవాన్ని పట్టుకుని పార్టీ పెట్టాడు. బాబాయి శవాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు పాత కక్షలతో జరిగిన రౌడీ హత్యను మా ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు” అని రవీంద్ర పేర్కొన్నారు.

జగన్ రెడ్డి చర్యలకు ప్రజల స్పందన

జగన్ రెడ్డి డ్రామాలకు ప్రజలు నమ్మకపోవడం ఖాయమని రవీంద్ర ధీమావ్యక్తం చేశారు.

“జగన్ రెడ్డి ఎన్ని డ్రామాలు చేసినా, ప్రజలు ఆయన కుట్రలను విశ్వసించేంత అమాయకులు కాదు. ప్రజలు జగన్ నిజస్వరూపాన్ని తెలుసుకుని ఆయనకు తగిన బుద్ధి చెప్తారు,” అని రవీంద్ర అన్నారు.

పల్నాడు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు

ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి రవీంద్ర ప్రజలకు హామీ ఇచ్చారు. పాలనను సక్రమంగా నిర్వహిస్తూ, రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.

“జగన్ రాజకీయ నాటకాలను పక్కనపెట్టి, ఆంధ్రప్రదేశ్ ను శాంతి మరియు ప్రగతితో ముందుకు తీసుకెళ్లడానికి సహకరించాలని కొల్లు రవీంద్ర హితువు పలికారు”

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version