ఎలూరులో వరదలపై వెట్రీ సెల్వి కృషి
అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఎలూరు జిల్లాలో కురిసిన వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. కార్యాలయంలో కూర్చుని పరిస్థితిని పర్యవేక్షించడానికి బదులుగా, పదిరోజుల క్రితమే విధుల్లో చేరిన ఐఏఎస్ అధికారి వెట్రీ సెల్వి స్వయంగా పరిస్థితిని అంచనా వేసేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం వర్షాన్ని తట్టుకొని వేలేరుపాడుకు చేరుకున్నారు.
స్వయంగా పర్యవేక్షణ
వెట్రీ సెల్వి గారు కారు వెళ్లలేని ప్రాంతాలకు మోటార్ సైకిల్ పై ప్రయాణించి, వరద పరిస్థితిని సమీక్షించి, తక్షణమే తీసుకోవలసిన చర్యలపై ఆదేశాలు జారీ చేశారు. ఆమె ధైర్యం మరియు ప్రజలకు సేవ చేయాలనే పట్టుదల చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
హెలికాప్టర్ రెస్క్యూ ఆపరేషన్లు
గురువారం రోజున, వెట్రీ సెల్వి వేలేరుపాడు ప్రాంతంలో వరదలలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్ సహాయ చర్యలను సమన్వయం చేశారు. ఈ ధైర్యవంతమైన చర్యలతో ప్రజల ప్రాణాలను కాపాడి, ఎలూరు జిల్లా ప్రజల మన్నన్నలు పొందిదామె.
ఈమె ధైర్య సాహసాలు ఆమెను “లేడీ టైగర్” అనిపించేలా చేశాయి.