పాకిస్థాన్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం: 2 రోజులుగా సమస్యలు

PaperDabba News Desk: July 19, 2024

భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌ ‘ఎక్స్‌’ను తాత్కాలికంగా నిషేధించింది. అదేవిధంగా మరికొన్ని సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో రెండు రోజులుగా ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వినియోగంలో యూజర్లకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేకాకుండా, మరికొందరు వాట్సాప్‌ వంటి మెటా యాప్‌ల యాక్సెస్‌లోనూ సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాలతో రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించేందుకు పాకిస్థాన్‌ సిద్ధమవుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

రాజకీయ ఉద్రిక్తతల సమయంలో ఆంక్షలు

మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీ, సైన్యం మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్న సమయంలో పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం ఈ నిషేధం విధించడం జరిగింది. అయితే పాక్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

పంజాబ్‌ ప్రభుత్వ విజ్ఞప్తి

మరియం నవాజ్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వాన్ని యూట్యూబ్‌, ఎక్స్‌ (ట్విటర్‌), వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టిక్‌టాక్‌ వంటి అన్ని సామాజిక మాధ్యమ వేదికలపై నిషేధం విధించాలని పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హింసకు దారి తీసే తప్పుడు సమాచారాన్ని నియంత్రించేందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లను యాక్సెస్‌ చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

గతంలో కూడా నిషేధం

గత ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ‘ఎక్స్‌’ (ట్విటర్‌)ను తాత్కాలికంగా ప్రభుత్వం నిలిపివేసింది. ఆరు నెలలుగా ఈ నిషేధం కొనసాగుతోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో మరిన్ని సోషల్‌ మీడియా వేదికలను కూడా ఆంక్షలు విధించే అవకాశాలు లేకపోలేదు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version