ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీపై వైఎస్ షర్మిల డిమాండ్

PaperDabba News Desk: జూలై 19, 2024

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సరైన మద్దతు ఇవ్వడంలో విఫలమవుతోందని వైఎస్ షర్మిల విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసినట్లుగానే ఆంధ్ర ప్రేదేశ్ ప్రభుత్వం కూడా అమలు చేయాలనీ ఆమె డిమాండ్ చేశారు.

పదిహేనేళ్ళ క్రితం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా రుణమాఫీ అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను చూపించింది. రీసెంట్‌గా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో, సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు, ఆదర్శాలను అనుసరించి, ఒక చారిత్రక అడుగు ముందుకువేసి, రైతు రుణమాఫీ ద్వారా రైతుల కళ్ళల్లో ఆనందం నింపింది.ఈ రోజు తెలంగాణ రైతుల ఇళ్లలో పండగ వాతావరణం నెలకొంది.

ఆంధ్రప్రదేశ్ కోసం షర్మిల డిమాండ్

ఆంధ్రప్రదేశ్ కూడా ఇలాగే రైతులకు రుణ మాఫీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశంలోనే అత్యధికంగా రైతులు అప్పులో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు ₹2,45,554 అప్పు ప్రతి రైతు నెత్తిమీద ఉందని గణాంకాలు తెలుపుతున్నాయి. గత దశాబ్దంలో కరువు, తుఫాన్లు, పూర్తికాని ప్రాజెక్టులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యవసాయం నాశనమైంది. ఇది ప్రస్తుత సర్కార్ గమనించి రైతులకు రుణమాఫీ చేసి ఆదుకోవాలని ఆమె కోరారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వ బాధ్యత

ప్రస్తుతం ఉన్న డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, కేంద్ర మద్దతుతో కూడిన ప్రభుత్వమై, రుణమాఫీ ఎందుకు చేయలేకపోతున్నారని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నట్లయితే, ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రైతు రుణమాఫీని గర్వంగా అమలు చేసి ఉండేదని ఆమె స్పష్టం చేశారు.

చివరి చర్యకు పిలుపు

రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేయడం అంటే వ్యవసాయాన్ని పునరుద్ధరించడం లాంటిదేనని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version