PaperDabba News Desk: 27 September 2024
తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ పై తీవ్రంగా స్పందించింది. సోమవారం నాడు హైకోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసులో ఉన్న భవనాన్ని ఎలా కూల్చారు అని హైకోర్టు ప్రశ్నించింది. అమీన్‌పూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్న ఈ ఘటనపై హైకోర్టు హైడ్రా కమిషనర్ నుంచి పూర్తి వివరణ కోరింది.
కోర్టు అనుమతి లేకుండా చర్యలు ఎందుకు తీసుకున్నారు?
కోర్టు అనుమతులు లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని ప్రశ్నిస్తూ, హైడ్రా కమిషనర్ పై నోటీసులు జారీ చేసింది.కమిషనర్ వ్యక్తిగతంగా లేదా వర్చువల్ గా సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కోర్టు ఆదేశాలను ఇలా ధిక్కరించి భవనాలను కూల్చివేయడం అనేది సీరియస్ అంశం అని హైకోర్టు హెచ్చరించింది.
తదుపరి విచారణ సోమవారంకు వాయిదా
ఈ కేసు తదుపరి విచారణ సోమవారం, సెప్టెంబర్ 30, 2024 న జరగనుంది. కమిషనర్ ఎలాంటి వివరణ ఇస్తారన్నది ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తుంది.
హైకోర్టు యొక్క ఈ తీర్పు, న్యాయ ప్రక్రియను గౌరవించకపోవడం ఎంత ప్రమాదకరమో స్పష్టం చేసింది. దీనిపై సరైన వివరణ ఇవ్వని పక్షంలో, కమిషనర్ పై తీవ్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది.