రైల్వే సమస్యలు పరిష్కరించండి – ఎంపి శ్రీకృష్ణదేవరాయలు

MP Srikrishnadevarayulu Urges Solutions for Railway Issues

PaperDabba News Desk: July 13, 2024

టీడీపీ పార్లమెంటరీ నేత మరియు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు ప్రాంత ప్రజలకు రైల్వే సేవలను మెరుగుపరచడానికి ఈరోజు హైదరాబాదులో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ని కలుసుకుని పలు రైల్వే సమస్యలను వివరించారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పలు సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని జీఎంకు అందజేశారు.

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కు పిడుగురాళ్లలో స్టాపేజ్

మార్చారో 6వ తేదీ నుండి తెనాలి – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ని పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ లో నిలిపేలా సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. ఈ సందర్భంగా ఈ రైలును విజయవాడ నుండి బెంగళూరు వరకు నడుపాలని అభ్యర్థించారు. ఈ రైలు నరసరావుపేట, వినుకొండ స్టేషన్లలో నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కొత్త రైలు సేవలు మరియు స్టేషన్ల ఆధునీకరణ

పేరుచెర్ల నుండి గన్నవరం లేదా పెదవుటపల్లి వరకు కొత్త ఎమ్ఎమ్ టిఎస్ రైలు సేవలను పరిచయం చేయాలని కోరారు. అదేవిధంగా, పెదకూరపాడు స్టేషన్ లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ స్టాపేజ్ ఇవ్వాలని, సత్తెనపల్లి స్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ స్టాపేజీ ఇవ్వాలని కోరారు. విశాఖపట్నం నుండి గుంటూరు వరకు నడిచే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైలును నరసరావుపేట పట్టణం వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేసారు.

బోగీల మెరుగుదల మరియు పౌష్టికత

పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా 25 సంవత్సరాల సేవలను పూర్తి చేసుకోవడం పట్ల ఎంపీ అభినందనలు తెలిపారు. ఈ రైలుకు ఉన్న బోగీలను వందే భారత్ రైళ్ల ప్రమాణాలతో కొత్త బోగీలకు మార్చాలని కోరారు.

పల్నాడు జిల్లాలోని నరసరావుపేట, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, మాచర్ల, నడికుడి రైల్వే స్టేషన్లను ప్రతిష్టాత్మకమైన అమృత్ భారత్ స్టేషన్ పథకం ఆధునికీకరణ చేపట్టాలని, రైల్వే లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేసారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version