• డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుడిని విచారిస్తున్న పోలీసులు
  • అమన్ ప్రీత్ సింగ్ తో పటు మరో నలుగురిని విచారిస్తున్న రాజేంద్రనగర్ డీసీపీ
  • అమన్, అంకిత్ రెడ్డి, ప్రసాద్, నిఖిల్ థావన్, మధుసూదన్ పై కేసు నమోదు
  • ఉస్మానియా ఆసుపత్రిలో బ్లడ్, యూరిన్ టెస్టులు నిర్వహించారు.
  • ప్రాధమిక బ్లడ్ టెస్ట్ లో పాజిటివ్ గా నిర్ధారణ

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డారు. అతనికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనితో అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి డ్రగ్స్ కేసు షేక్ చేస్తుంది. హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపుతోంది. అమన్ కు నిర్వహించిన డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది. దాంతో అమన్ పై కేసు ఫైల్ చేశారు పోలీసులు.

నార్సింగ్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం రావడం తో నార్కోటిక్ బ్యూరో రంగంలోకి దిగింది. SOT (Special Operation Team ) రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది. ఒక ఫ్లాట్ పై రైడ్ చేసి  రూ . 35 లక్షలు విలువ చేసే 199 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారిలో ఉన్నారు.

నైజీరియాకు చెందిన అనుహా బ్లెస్సింగ్స్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఆరు నెలలో 20 సార్లు నైజీరియా నుంచి ఆమె డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన 13 మందిని గుర్తించారు. అందులో 6గురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా, వారికి పాజిటివ్ వచ్చింది. దీనిలో హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడు. అమన్ ప్రీత్ సింగ్ తో పాటు మరో నలుగురు అంకింత్, ప్రసాద్, నిఖిల్ థావన్ ఎం, మధుసూదన్ పై కేసు నమోదు చేశారు.

డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ వినియోగదారుడు గానే ఉన్నాడని తెలిపారు డీసీపీ. ఆతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్రస్తుతం వారిని విచారిస్తునట్లు తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు డీసీపీ .

మొత్తానికి ఈ డ్రగ్స్ దందా వెనుక ఇంకెవరెవరు ఉన్నారన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version