తెలంగాణ కళలకు కాణాచి: మంత్రి జూపల్లి కృష్ణారావు

PaperDabba News Desk: 18 జూలై 2024
తెలంగాణ కళలకు కాణాచిగా ఉందని, జానపద కళలు, శాస్త్రీయ కళలు, సంగీతం, నృత్యం హైదరాబాద్ దక్కని కళారూపాలు ఎన్నో తెలంగాణలో విలసిల్లుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ నాట్యకారిణి, సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పద్మజా రెడ్డి ప్రదర్శించిన కాకతీయం 3వ భాగం నృత్య రూపక కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

Telangana: A Haven for Arts and Culture, Says Minister Jupally Krishna Rao

కాకతీయ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు

ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… కాకతీయులు ఎన్నో సాహిత్య, సాంస్కృతిక, కళారూపాలను, కళాకారులను పోషించారని, అందులో పేరిణి నాట్యం కూడా ఒకటన్నారు. ఆ క్రమంలోనే డాక్టర్ పద్మజా రెడ్డి కాకతీయ వైభవాన్ని, కాకతీయుల ఔన్నత్యాన్ని చాటే విధంగా “కాకతీయం” అనే నృత్య రూపకాన్ని నాటక రూపంలో కాకతీయ కాలంలో రుద్రమదేవి, ఇతర చక్రవర్తులు ఆనాటి కళా సంప్రదాయాలు, రీతులు అన్నీ ఈ నాట్య రూపకంలో అద్భుతంగా కళ్లకు కట్టినట్టుగా చూపించారన్నారు. కలలను సజీవంగా ఉంచేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

కళాకారులకు ప్రోత్సాహం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళలు, సంస్కృతి, సాహిత్యం లో అభివృద్ధి కోసం కృషి చేస్తుందని, కళాకారులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఇటీవలే పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున నగదు బహుమతిని ప్రభుత్వ పరంగా అందజేశామని వెల్లడించారు.

ప్రభుత్వం చర్యలు

అలాగే రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండే అన్ని రకాల జానపద, గిరిజన, శాస్త్రీయ కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version