నా దేశ ప్రజలకు అతి తక్కువ ధరలకే 5జి సేవలు అందిస్తా – రతన్ టాటా

 టెలికాం రంగంలో విప్లవం 

రతన్ టాటా టెలికాం రంగంలో విప్లవం తీసుకురాబోతున్నారా ? ఇదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్తు భారత్ దేశంలోనే దవాలంగా వ్యాప్తి చెందుతున్న వార్త ఇది. ప్రస్తుత మార్కెట్లో రారాజులా ఏలుతున్న ఎయిర్టెల్ మరియు జియో అలాగే వీఐ నెట్వర్క్ లు తమ చార్జిస్ ని విపరీతంగా పెంచేసిన విషయం తెలిసిందే. దేనితో మొబైల్ యూజర్లు తలలు పట్టుకుంటుకుని, దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ కు అలవాటు పడిపోయారు. మొబైల్ లో ఇంటర్నెట్ లేకుండా రోజు గడవడం లేని పరిస్థితిలోకి వెళ్లిపోయాం. ఇక్కడే కార్పొరేట్ బిజినెస్ ఒక్కసారిగా పంజా విసరడం మొదలుపెట్టాయి.

నా ఆలోచన ఎప్పుడు సామాన్యులపైనే 

రతన్ టాటా ఎప్పుడు మధ్య తరగతి, అలాగే బీలో మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొనే తమ ప్రాజెక్టులను రూపొందిస్తూ ఉంటారు. వాళ్ళ మనుగడ పైనే ఆయన ఆలోచన తిరుగుతూ ఉంటాయి. ఈ సందర్భంలోనే  అయన ఒక్కసారిగా టాటా టెలికాం రంగంపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే BSNL తో కలిసి 15 వేల కోట్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. BSNL తో కలిసి ఈ రంగంలో సేవలను విస్తరించేందుకు అయన సిద్దపడుతున్నారు.

249 రూపాయలకే 45 రోజులపాటు సేవలు 

ఈ సంవత్సరం ఆగస్టులో BSNL 4జి ని లాంచ్ చేయడంతోపాటుగా వచ్చే ఏడాది కల్లా 5జి ని కూడా అప్డేట్ చేసేందుకు సిద్ధమౌతున్నారు. అతి తక్కువ ధరలకు తమ సేవలు అందించాలని సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా 249 రూపాయలకే 45 రోజుల పాటు అపరిమితమైన ఫ్రీ కాల్స్ మరియు రోజుకు 2gb డేటా ను ఇవ్వనుంది. తమ యూజర్స్ కి నాణ్యమైన సేవలు అందించి మరింత చేరువ అవ్వాలని ఆశిస్తుంది. అతి త్వరలో BSNL ఫ్రీ సిమ్ములు అందరికి అందించే కార్యక్రమం కూడా చేప్పట్టబోతోంది BSNL.

హర్షం వ్యక్తం చేస్తున్న మొబైల్ యూజర్లు 

అతి తక్కువ ధరలకు టెలికాం సేవలు అందించేందుకు సిద్దమవుతున్న టాటా పై యావత్తు దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

 

 

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version