యూరో ఎక్సిమ్ బ్యాంకు ఆర్ టీవీ పై 100 కోట్ల పరువునష్టం దావా

తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను ఆర్ టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ రవిప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు లీగల్ నోటీసులు జారీ చేసింది.

నోటీసులు జారీ

పలు నిర్మాణ పనులను టెండర్లు లో భాగంగా దక్కించుకున్న తన క్లయింటు మేఘ ఇంజనీరింగ్ సంస్థ తరపున ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ ని తప్పు పడుతూ ఆర్ టీవీ లో రవిప్రకాష్ తానె స్వయంగా కధనాలు ప్రసారం చేసారు. అవి దొంగ బ్యాంకు గ్యారంటీలు అంటూ తప్పుడు కధనాలు ప్రసారం చేసినందుకు గాను రవిప్రకాష్ కు యూరో ఎక్సిమ్ బ్యాంకు తరపున లీగల్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది.

యూరో ఎక్సిమ్ బ్యాంకు పై ప్రభావం

ఈ కధనాల వల్ల కంపెనీకి ఆర్ధికంగా నష్టం వాటిల్లిందని, పరువు ప్రతిష్టలు కూడా భంగపడ్డాయని ఆ నోటీసులో ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థయిర్యం దెబ్బతింది అని ఆవేదన వ్యక్తం చేసింది. తమ బ్యాంకు లండన్ కేంద్రంగా ప్రపంచవ్యాపితంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఇండియాలో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకు గ్యారంటీలను చట్టబద్ధంగా ఇస్తోందని పేర్కొంది.

నిషేధం మరియు క్షమాపణలు

యూరో ఎక్సిమ్ బ్యాంకు వార్షిక వ్యాపారం 8 కోట్లు మాత్రమేనని ఆ కధనంలో పేర్కొనటాన్ని ఏజెన్సీ తప్పు పట్టింది. కనీసం 1900 కోట్ల టర్నోవరును ఈ ఎక్సిమ్ బ్యాంకు కలిగి ఉండగా, తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి ఆ లింకులను తొలగించక పొతే కోర్టులో పరువు నష్టం దావా 100 కోట్లకు వేస్తామని, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంకు తరపున చెన్నై కు చెందిన అడ్వకేట్ BSV ప్రకాష్ కుమార్ ఆర్ టీవీ రవి ప్రకాష్ కు నోటీసిలు పంపించారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version