ఆంధ్ర కేబినెట్ నిర్ణయాలు: భూ చట్టం రద్దు, ఉచిత ఇసుక విధానం

PaperDabba News Desk: 16 జూలై 2024

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్య నిర్ణయాలు

మంగళవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో ముఖ్యమైన పలు నిర్ణయాలు తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దు

ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ – 2022 రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పలు పత్రికలు మరియు ఇతర మీడియా సంస్థల ద్వారా ప్రజలు వ్యక్తం చేసిన అనుమానాలు, భయాలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

రద్దు చేయడానికి కారణాలు:

నీతి ఆయోగ్ రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం టీఆర్ వో గా ప్రభుత్వ అధికారి ఉండాలి. కానీ గత ప్రభుత్వం అర్హత లేని వ్యక్తులను కూర్చోబెట్టింది.
సివిల్ కోర్టుల ప్రమేయం పూర్తిగా తొలగించడం, సమస్యలు హైకోర్టుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి.
ప్రస్తుత రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ ప్రభావితమవుతాయి.
హడావిడిగా చేయబడిన చట్టం, ఒరిజినల్ డాక్యుమెంట్స్ దగ్గర ఉంచడం.
భూయజమానులకు సక్రమమైన భద్రత లేకుండా చేస్తుంది.
జీపీఏలు భూయజమానులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది.
రాజకీయ ఒత్తిడికి తలొగ్గే అవకాశం.

ఉచిత ఇసుక విధానం మధ్యంతర వ్యవస్థ

ఇసుక, గనుల పాలసీ – 2019 మరియు ఇసుక విధానం – 2021లను రద్దుచేస్తూ, ఉచిత ఇసుక విధానం – 2024 ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

అమలు చేసే చర్యలు:

ఉన్న ఒప్పందాలను నిలిపివేయడం.
ఇసుక స్టాకులను సంబంధిత అధికారులకు అప్పగించడం.
వినియోగదారుల అభిప్రాయాలతో పర్యావరణ హితంగా సమగ్ర ఇసుక విధానం – 2024 రూపొందించడం.

ధాన్యం కొనుగోలు కోసం రూ. 2000 కోట్ల రుణం

2024-25 సంవత్సరానికిగానూ ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర పౌర సరఫరాల సంస్థకు వాణిజ్య బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థల నుండి రూ. 2000 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఏపీ మార్క్ ఫెడ్ కు రూ. 3200 కోట్ల రుణం

2024-25 సంవత్సరానికిగానూ ఎన్ సీ డీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుండి వర్కింగ్ కేపిటల్ అసిస్టెన్స్ రూపేణా రూ. 3200 కోట్ల రుణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఇతర ముఖ్యమైన ప్రకటనలు

ప్రకృతి వ్యవసాయంలో అంతర్జాతీయ గుర్తింపు:

ఆంధ్రప్రదేశ్ కు గుల్బెంకియన్ అవార్డు, వ్యవసాయ రంగంలో నోబెల్ ప్రైజ్ తో సమానం. ఈ అవార్డుతో రూ. 9 కోట్ల ప్రైజ్ వచ్చింది. 2018లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రారంభమైన ప్రకృతి సేద్యం, 2029 నాటికి 20 లక్షల హెక్టార్లకు పెంచడం.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version