blockquote>PaperDabba News Desk: July 16, 2024
ఆంధ్రప్రదేశ్ లో ప్రజారోగ్యం తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది, దీనిపై వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మోండితోక జాగన్‌మోహన్ రావు, టిడిపి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
ప్రజారోగ్య సమస్యలు ప్రభుత్వ వైఫల్యాన్ని ఆవిష్కరిస్తున్నాయి
మంగళవారం మీడియా పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన డాక్టర్ జాగన్‌మోహన్ రావు… రాష్ట్రంలోని ప్రజలకు సరైన తాగునీరు కూడా ప్రస్తుత ప్రభుత్వం అందించలేకపోతుందని విమర్శించారు. దీని కారణంగా ప్రజలు డయేరియా వంటి రోగాలకు బలౌతున్నారని మండిపడ్డారు. రోజు రోజుకు ఈ కేసులు సంఖ్య పెరుగుతుందని, దీనికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు.
ప్రజా సంక్షేమం కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యం
డాక్టర్ రావు ఇంకా మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే రాజకీయా ప్రతీకారాలకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో ఈ అత్యవసర ఆరోగ్య సమస్యలపై ద్రుష్టి పెట్టడం మాని, వైఎస్సార్సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వారిని ఇబ్బంది పెట్టడంలోనే బిజీగా ఉందని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి మరియు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత పాలనలో విద్య మరియు వైద్య రంగాలలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చారని, అందరికీ ఉచిత వైద్యం ప్రాధాన్యం ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.
వైద్య మౌలిక వసతుల నిర్లక్ష్యం
చంద్రబాబు నాయుడు పాలనలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల కూడా స్థాపించ ఏర్పాట్లు చేయడం లేదని, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ సంవత్సరంలో ఐదు కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించబడడం రద్దు అయ్యిందని అన్నారు.
తక్షణ చర్య అవసరం
ప్రజారోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రజలందరికీ సురక్షిత త్రాగునీరు అందించడానికి మరియు వైద్య మౌలిక వసతులను మెరుగుపరచడానికి తక్షణ చర్యలు అవసరం అని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొనసాగుతున్న ప్రజారోగ్య సంక్షోభం, ప్రజల శ్రేయస్సును కాపాడడానికి ప్రభుత్వం తక్షణం మరియు సమర్థవంతమైన చర్యలను తీసుకోవాలి.