అనకాపల్లి మైనర్ హత్య కేసు నిందితుడు ఆత్మహత్య

Shocking Twist: Anakapalli Minor Murder Case Accused Commits Suicide

PaperDabba News Desk: July 11, 2024

ఈనెల 5న అనకాపల్లిలో మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేసిన సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడి కోసం పోలీసులు 12 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు రాంబిల్ల మండలం కొప్పుగుండు పాలెంలో నిందితుడు సురేష్ మృతదేహం లభ్యమైంది.

కేసు నేపథ్యం

అనకాపల్లికి చెందిన బాలికను నిందితుడు సురేష్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేశాడు. ఆమె నిరాకరించడంతో ఈనెల 5న ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆపై సురేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలో కూడా బాలికను సురేష్ వేధింపులకు గురిచేయడంతో.. అతడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. తనను అరెస్ట్ చేయించారని కోపంతో రగిలిపోయిన సురేష్.. బెయిల్‌పై విడుదలైన వెంటనే బాలికను దారుణంగా హతమార్చినట్లు తల్లిదండ్రులు వాపోయారు.

పోలీసుల దర్యాప్తు

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని పట్టుకోడానికి తీవ్రంగా శ్రమించారు. నిందితుడు విడిచి వెళ్లిన లేఖ ఆధారంగా సురేష్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు భావించారు. ‘‘ఉంటే ఇద్దరం కలిసి ఉండాలని.. లేదంటే చనిపోవాలి’’ అని లేఖలో నిందితుడు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అలాగే నిందితుడిని ఆచూకీ తెలిపిన వారికి రూ.50వేల నగదు బహుమతిని కూడా పోలీసులు ప్రకటించారు. కానీ… చివరకు నిందితుడు లేఖలో తెలిపిన ప్రకారం ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version