పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ – పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.
బిపీసీఎల్ పెట్టుబడులపై చర్చ
బిపీసీఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, ఇతర ప్రతినిధులతో కలిసి రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు పై చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు తన డిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు.
బిపీసీఎల్ ప్రతినిధులు ఆయిల్ రిఫైనరీ మరియు పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని ముఖ్యమంత్రికి తెలియజేశారు. ముఖ్యమంత్రి అవసరమైన భూమిని కేటాయిస్తామని, 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు పూర్తి ప్రణాళికతో రావాలని కోరారు. బిపీసీఎల్ ప్రతినిధులు అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని వివరించారు.
విన్ ఫాస్ట్ పెట్టుబడులపై చర్చ
ఆ తర్వాత విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ వియత్నాంలో ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ నాట్ వుఒంగ్ తో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు.
సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరించి, ఈవీ మరియు బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని సూచించారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాలను అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని విధాలా సహకరిస్తామని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఇక భేటీలకు ముందు ముఖ్యమంత్రి బిపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేశారు.
ఈ భేటీలు ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల కేంద్రంగా ఎదగడం కు తోడ్పడతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చొరవతో, రాష్ట్రంలో భారీ పెట్టుబడులు ఆకర్షించడం సాధ్యమవుతుంది.