అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి-పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -
- Advertisement -
  • పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన
  • అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి
  • కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి
  • జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి
  • కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం
  • జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 

రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను  పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్.ఒ.ఎఫ్.ఎఫ్.)  చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్  కె. కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు  ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే,  శరవణన్, డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు,  శ్రీకాంతనాథ రెడ్డి,  సి.సెల్వం, శ్రీమతి మంగమ్మ, శ్రీమతి ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటరినరీ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ కె. వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

  • కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయండి
  • ప్రతి రోజు ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలి
  • ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు రెండు గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. మండలి ప్రధాన కార్యాలయంతోపాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు సమయం కేటాయించాలన్నారు. మండలి వెబ్ సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గం. నుంచి 5 గం. మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకొనేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో మండలి అధికారులు  ఎన్.వి.భాస్కర రావు,  కె.శ్రీరామమూర్తి, పి.ప్రసాద రావు పాల్గొన్నారు.

- Advertisement -

Hot this week

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది – రేవంత్ రెడ్డి

PaperDabba News Desk: 2024-07-17 రైతులకు ఊరట: రుణమాఫీ పథకం అమలులో కీలక...

పుష్ప 2 భారీ డీల్ తో రికార్డు సృష్టించింది! వివరాలివిగో…

PaperDabba News Desk: July 11, 2024 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...

పూరి జగన్నాథ దేవాలయంలో వెలుగులోకి మూడు రహస్య గదులు

PaperDabba News Desk: July 15, 2024 పూరి దేవాలయంలో రహస్య గదులు...

ఎన్టీఆర్ పాన్ ఇండియా చిత్రం “దేవర”పై భారీ అంచనాలు

PaperDabba News Desk: July 13, 2024 ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ...

Follow us

Topics

జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనం

అన్యాయములు ప్రతిఘటిస్తాం, త్యాగాలు చేస్తాం ఆనం విమర్శలు గతంలో ఇరు తెలుగు రాష్ట్రాల...

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు

PaperDabba News Desk: July 22, 2024 వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున...

గోదావరి వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అవసరం: సిపిఐ నేత రామ కృష్ణ

PaperDabba News Desk: 21 జూలై 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో...

ప్రతి నెలా పింఛను పంపిణీకి ఎమ్మెల్యేలు తప్పనిసరి

PaperDabba News Desk: July 21, 2024 మంత్రులు, ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు...

ఆదిత్య విద్యార్థిని రికార్డు

ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థిని రికార్డు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ)...

విశాఖలో వైసీపీకి పెద్ద షాక్: 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి

PaperDabba News Desk: 21 జూలై 2024 విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

Related Articles

Latest Posts

ఎమ్మెల్యే కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ దక్కేనా ?

PaperDabba News Desk: 21 July 2024 ఆముదాలవలస నియోజక వర్గ ఎమ్మెల్యే,...

భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత

PaperDabba News Desk: Jul 20, 2024 భారీ వర్షాలు అల్లూరి జిల్లాలో...

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్యాన్స్‌కు షాక్!

PaperDabba News Desk: జూలై 20, 2024 ఐపీఎల్ 2025కు ముందు ఢిల్లీ...

మహారాష్ట్రలో అదానీ కాంట్రాక్ట్ రద్దు చేస్తాం: ఉద్ధవ్ ఠాక్రే

PaperDabba News Desk: July 20, 2024 మహారాష్ట్రలో తాము అధికారంలోకి వస్తే...

దర్శకుడు వినోద్ ధోండాలే ఆత్మహత్య, ఇండస్ట్రీ షాక్‌లో

PaperDabba News Desk: జులై 20, 2024 కన్నడ బుల్లితెర దర్శకుడు వినోద్...

ఏపీ పెండింగ్ ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు

ఏపీ పెండింగ్ ప్రాజెక్టులపై టీడీపీ పార్లమెంటరీ సమావేశం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

గోదావరి ఉగ్రరూపం – భద్రాచలంలో 31 అడుగులకి చేరిన నేటి మట్టం

PaperDabba News Desk: 20 July 2024 గోదావరి ఉగ్రరూపం భద్రాచలం దగ్గర గోదావరి...

కర్నూలులో శ్రీరెడ్డి పై షాకింగ్ కేసు నమోదు

PaperDabba News Desk: 20 జూలై 2024 వివాదాస్పద వ్యాఖ్యలు కేసు నమోదు సినీనటి...

సానిపాయలో ఎర్రచందనం స్వాధీనం: ఒకరు అరెస్టు

PaperDabba News Desk: 20 July 2024 సానిపాయ అటవీ ప్రాంతంలో 8...

శనివారం ఉదయం తెలంగాణ, చత్తిస్ ఘడ్ సరిహద్దులో పోలీసులు, మావోయిస్టుల మధ్య...

తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు సహాయం

మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల...

కమ్మ గ్లోబల్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

PaperDabba News Desk: July 20, 2024 రేవంత్ రెడ్డి కమ్మ గ్లోబల్...

మోదీ 100 మిలియన్ ఫాలోవర్లు-ఎలెన్ మాస్క్ అభినందనలు

PaperDabba News Desk: 2024-07-20 ప్రధాని నరేంద్ర మోదీకి మరో ఘనత దక్కింది....

వారెవ్వా! లేడీ టైగర్ కలెక్టర్ వెట్రి సెల్వి సాహసం

ఎలూరులో వరదలపై వెట్రీ సెల్వి కృషి అల్పపీడన ప్రభావంతో ఇటీవల ఎలూరు జిల్లాలో...

జగన్ డ్రామాలను ప్రజలు నమ్మేపరిస్థితి లేదు – మంత్రి కొల్లు రవీంద్ర

జగన్ రెడ్డి రాజకీయ నాటకాలు - మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు వ్యక్తిగత...

ఏపీ మహిళలకు గుడ్‌న్యూస్‌: ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ

PaperDabba News Desk: July 20, 2024 ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర మహిళలకు...

మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్య పై స్పందించిన కేంద్ర మంత్రి వైష్ణవ్

PaperDabba News Desk: July 20, 2024 మైక్రోసాఫ్ట్ సేవలు నిలిచి పోవడానికి...

స్కిల్ యూనివర్సిటీ ప్రాజెక్ట్: విజయవంతంగా ముగిసిన ముఖ్యమంత్రి సమావేశం

PaperDabba News Desk: 20 July 2024 తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల అధికారులతో...

భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

పెరుగుతున్న వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం...

వినుకొండ హత్యపై ఎమ్మెల్యే ఆంజనేయుల స్పందన

PaperDabba News Desk: జూలై 19, 2024 వినుకొండ హత్యపై ఎమ్మెల్యే ఆంజనేయుల...

3 ఏళ్లలో నక్సలిజం సమస్య పరిష్కారం: ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం

చత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం విజయ్‌ శర్మ తమ రాష్ట్రంలో నక్సలిజం సమస్యను...

పాకిస్థాన్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిషేధం: 2 రోజులుగా సమస్యలు

PaperDabba News Desk: July 19, 2024 భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్‌...

ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణమాఫీపై వైఎస్ షర్మిల డిమాండ్

PaperDabba News Desk: జూలై 19, 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి...