బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ | జూన్ 27, 2024 : ఆషాడ మాసం సందర్భంగా జరిగే బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సమీక్ష నిర్వహించారు. జూలై 7న ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు, ముఖ్యంగా జూలై 21 మరియు 22 తేదీలలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగనున్నాయి.

సిద్ధతలు మరియు సూచనలు

ఈ సమీక్షా సమావేశంలో, జూలై 5నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి పన్నం ప్రభాకర్ గారు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద భక్తులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని సూచించారు.

ఉత్సవాల షెడ్యూల్

జూలై 21న బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రధాన దేవత దర్శనం తర్వాత, మరుసటి రోజు ఉదయం 9 గంటలకు రంగం మరియు గజాధిరోహణ మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అమ్మవారు అంబారిపై ఊరేగింపు ఉంటుంది.

చారిత్రక ప్రాముఖ్యత

1830 నుండి అమ్మవారికి బోనాలు సమర్పించే సంప్రదాయం ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు తెలిపారు. ప్రజల సహకారం తో ఈ ఉత్సవాలు విజయవంతం అవ్వాలని కోరారు. ఈ ఏడాది బోనాల ఉత్సవాల కోసం మంత్రి కొండా సురేఖ గారి నాయకత్వంలో రూ.20 కోట్లు విడుదల చేశారని తెలిపారు.

నిర్వాహక ఏర్పాట్లు

ఆలయ పరిసరాల్లో లైటింగ్, నిరంతర నీటి సరఫరా, అదనపు ట్రాన్స్ఫార్మర్ లతో పాటు, భద్రతా ఏర్పాట్లను పక్కాగా చేయాలని మంత్రి పన్నం ప్రభాకర్ గారు సూచించారు. వాటర్ పాకెట్స్, వాటర్ బాటిల్స్, నాలుగు హెల్త్ క్యాంపులు, ప్రత్యేక అంబులెన్స్, ఫైర్ ఇంజన్స్, వెల్‌కమ్ బోర్డుల వంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతోంది.

అమ్మవారి ఆశీర్వాదం తో, ప్రజల సహకారంతో మరియు అధికారుల సమన్వయంతో ఈ బోనాల ఉత్సవాలు ఘనవిగా జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version