మెగా డీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటు విమర్శ

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ – తెలంగాణ మాజీ మంత్రి కే.టి. రామారావు (కేటీఆర్) ట్విట్టర్ లో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ వాగ్దానం పై సీఎం రేవంత్ రెడ్డి తీరును తీవ్రంగా విమర్శించారు.

కేటీఆర్ ఘాటు ట్వీట్లు

సీఎం రేవంత్ రెడ్డికి మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ పై చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ఈ విషయంపై CM నిబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతూ, రేవంత్ రెడ్డి పదవిలోకి వచ్చి 9 నెలలు గడిచినా, ఈ ప్రక్రియ ఏమాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. వేలాది డీఎస్సీ అభ్యర్థులు ఉత్సాహంగా ఉద్యోగ అవకాశాల కోసం వేచి ఉన్నారన్న బాధను కేటీఆర్ ప్రస్తావించారు.

నెరవేర్చని వాగ్దానాలు

మొదటి క్యాబినెట్ సమావేశంలోనే 25,000 పోస్టులతో మెగా డీఎస్సీ అన్నారు. కానీ దానికి అనుగుణంగా అడుగులు మాత్రం రేవంత్ సర్కార్ వేయడంలేదని కేటీఆర్ విమర్శించారు. దీనితో అభ్యర్థులలో నిరాశ పేరుకుపోతుందని తెలిపారు. వారికీ బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల గోడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వినబడడం లేదని వ్యాఖ్యానించారు.

గత వివాదాలు

ఈ సందర్భంగా గత వివాదాలను కూడా కేటీఆర్ గుర్తుచేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను “బీరు బిర్యానీ బ్యాచ్” అని, సిద్దాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని ఎగతాళి చేసిన విషయాలను గుర్తు చేశారు.

ప్రస్తుత పరిస్థితి ఉస్మానియా విశ్వవిద్యాలయం

నిఖార్సుగా నిరసన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులపై ప్రభుత్వం చేబడుతున్న చర్యలను కేటీఆర్ ఖండించారు. శాంతియుత నిరసన ప్రదర్శించే హక్కును కాలరాస్తున్నారని, వందల మందిని అరెస్టు చేసి అక్రమ కేసులు పెట్టడం అన్యాయమని పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సరిహద్దులో లేదు కాబట్టి ఇన్ని బలగాలు ఎందుకు, ఎందుకు ఇంత నిర్బంధం అని ప్రశ్నించారు.

డీఎస్సీ అభ్యర్థులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నెరవేర్చని వాగ్దానాలు మరియు కఠిన చర్యలు వదిలిపెట్టాలని, యువతకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని పిలుపునిచ్చారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version