అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి-పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -
- Advertisement -
  • పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన
  • అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి
  • కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి
  • జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి
  • కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం
  • జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ 

రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతిల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని చెప్పారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను  పవన్ కళ్యాణ్ కి అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.

ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. జూ పార్కుల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం వంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పారు.

  • రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శన శాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలన్నారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. సమావేశంలో అటవీశాఖ పీసీసీఎఫ్ (హెచ్.ఒ.ఎఫ్.ఎఫ్.)  చిరంజీవి చౌదరి, పర్యాటక శాఖ కమిషనర్  కె. కన్నబాబు, అటవీ శాఖ ఉన్నతాధికారులు  ఎ.కె.నాయక్, డాక్టర్ శాంతిప్రియ పాండే,  శరవణన్, డాక్టర్ ఎన్.నాగేశ్వరరావు,  శ్రీకాంతనాథ రెడ్డి,  సి.సెల్వం, శ్రీమతి మంగమ్మ, శ్రీమతి ఎన్.నాగరాణి, ఎస్వీ యూనివర్శిటీ వెటరినరీ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ కె. వీరబ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

 

  • కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయండి
  • ప్రతి రోజు ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలి
  • ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు

ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు రెండు గంటల పాటు నిర్దేశిత సమయాన్ని ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చారు. బుధవారం మంగళగిరిలోని తన నివాసంలో కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమావేశమయ్యారు. మండలి ప్రధాన కార్యాలయంతోపాటు రీజినల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు సమయం కేటాయించాలన్నారు. మండలి వెబ్ సైట్లో రాష్ట్రంలో వాయు, జల, శబ్ద కాలుష్యాల వివరాలను ప్రజలకు అవగాహన కలిగించే విధంగా పొందుపరచాలని స్పష్టం చేశారు. ప్రతి రోజు మధ్యాహ్నం 3 గం. నుంచి 5 గం. మధ్య ఫిర్యాదులు స్వీకరణ, సమస్యలు తెలుసుకొనేందుకు సమయం నిర్దేశిస్తామని మండలి సభ్య కార్యదర్శి బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో మండలి అధికారులు  ఎన్.వి.భాస్కర రావు,  కె.శ్రీరామమూర్తి, పి.ప్రసాద రావు పాల్గొన్నారు.

- Advertisement -

Hot this week

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ గ్రాండ్ వివాహం: రజినీకాంత్ డాన్స్ వైరల్

అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ యొక్క వేడుక గ్రాండ్ గా...

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

స్నేహితుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలి – మోదీ ఆందోళన

PaperDabba News Desk: July 14, 2024 భారత ప్రధాని నరేంద్ర మోదీ...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు...

Follow us

Topics

విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులు వేగవంతం చేయాలి – రామ్మోహన్ నాయుడు

విజయవాడ విమానాశ్రమ విస్తరణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను కేంద్ర...

ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి పోటెత్తిన భక్తులు… రద్దీగా మెట్రో స్టేషన్

ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి అటు...

సోమేశ్ కుమార్ కు సీఐడీ నోటీసులు

మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు...

రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం

రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన...

పారిశుధ్య నిర్వహణ లో ఎక్కడ లోపం ఉండకూడదు-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్

విజయవాడ నగరంలో ఎక్కడ పారిశుధ్య నిర్వహణలో లోపం ఉండకూడదని ఆదేశించారు నగరపాలక...

ఇది దేశ హిత బడ్జెట్ – బండి సంజయ్

కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలపై బండి సంజయ్ కౌంటర్ PaperDabba...

Related Articles

Latest Posts

రాజధాని అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేంద్రం సాయం – మంత్రి అచ్చెన్నాయుడు

PaperDabba News Desk: 2024-07-23 నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15...

మదనపల్లిలో అగ్ని ప్రమాదంపై సిసోడియా విచారణ

PaperDabba News Desk: July 23, 2024 చంద్రబాబు ఆదేశాల మేరకు లోతైన...

వరద ప్రభావిత గ్రామాల్లో తాగునీటి సప్లై చర్యలు – పవన్ కళ్యాణ్

PaperDabba News Desk: July 22, 2024 ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ చర్యలు రాష్ట్రంలో...

జగన్‌కు ఇంకా తత్వం బోధపడలేదు- పవన్‌ కల్యాణ్‌

PaperDabba News Desk: 22 July 2024 పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు ఎన్డీఏ...

2019-24 ఆంధ్రప్రదేశ్ లో తీవ్రమైన నష్టం: గవర్నర్ అబ్దుల్ నజీర్

PaperDabba News Desk: 2019-24 కాలంలో రాష్ట్రం ఎదుర్కొన్న తీవ్ర నష్టం...

ప్రత్యేక హోదాకు 5 అర్హతలు, ఏపీకి రానట్లేనా?

PaperDabba News Desk: జూలై 22, 2024 ఈ రోజు పార్లమెంట్‌లో జరిగిన...

బాబాయి హత్యపై నిర్లక్ష్యం ఎందుకు? – షర్మిల

PaperDabba News Desk: July 22, 2024 బాబాయి హత్యపై షర్మిల ఆగ్రహం జగన్...

సైబరాబాద్ SOT పోలీసులు 100 నకిలీ బంగారు బిస్కట్స్ పట్టివేత

నకిలీ బంగారు బిస్కట్స్ స్కాం బస్టెడ్ సైబరాబాద్ SOT పోలీసులు నకిలీ బంగారు...

‘చంద్రయాన్-3’కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డు

PaperDabba News Desk: July 21, 2024 భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ...

వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వద్ద అడ్డుకున్న పోలీసులు: జగన్ ఆగ్రహం

Assemblyలో పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం YSRCP సభ్యులు అసెంబ్లీ గేటు వద్దనే...

జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆనం

అన్యాయములు ప్రతిఘటిస్తాం, త్యాగాలు చేస్తాం ఆనం విమర్శలు గతంలో ఇరు తెలుగు రాష్ట్రాల...

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టు

PaperDabba News Desk: July 22, 2024 వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రతినిధి నాగార్జున...

గోదావరి వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయం అవసరం: సిపిఐ నేత రామ కృష్ణ

PaperDabba News Desk: 21 జూలై 2024 రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో...

ప్రతి నెలా పింఛను పంపిణీకి ఎమ్మెల్యేలు తప్పనిసరి

PaperDabba News Desk: July 21, 2024 మంత్రులు, ఎమ్మెల్యేల కోసం చంద్రబాబు...

ఆదిత్య విద్యార్థిని రికార్డు

ఆదిత్య ఇంజనీరింగ్ విద్యార్థిని రికార్డు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల బీటెక్ (ఈసీఈ)...

విశాఖలో వైసీపీకి పెద్ద షాక్: 12 మంది కార్పొరేటర్లు టీడీపీలోకి

PaperDabba News Desk: 21 జూలై 2024 విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

సోనూ సూద్ కు పాలాభిషేకం చేసిన కర్నూలు విద్యార్థిని

ఈ ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బనవనూరుకు చెందిన దేవి...

ఎమ్మెల్యే కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ దక్కేనా ?

PaperDabba News Desk: 21 July 2024 ఆముదాలవలస నియోజక వర్గ ఎమ్మెల్యే,...

భారీ వర్షాలు.. ఘాట్ రోడ్లు మూసివేత

PaperDabba News Desk: Jul 20, 2024 భారీ వర్షాలు అల్లూరి జిల్లాలో...