“వికసిత భారత్ 2047” అనుగుణంగా పని చేయాలి – పవన్ కళ్యాణ్

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ – పర్యావరణ నిబంధనల అమలు పైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమల ప్రతినిధులతో ఈ సమావేశంలో పర్యావరణ నిబంధనల అమలుపై చర్చ జరగనుంది.

కాలుష్య నియంత్రణపై నిరంతర సమీక్ష

జల, వాయు, శబ్ద కాలుష్య నియంత్రణపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. “పర్యావరణ నిబంధనలు పారిశ్రామిక ప్రగతికి అవరోధం కాదు. పర్యావరణహితంగా పరిశ్రమలు నిర్వహించడం అవసరం,” అని తెలిపారు.

వికసిత భారత్ – 2047 లక్ష్యంలో భాగంగా కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన పవన్ కళ్యాణ్ పీసీబీ అధికారులను ఆదేశించారు.

సముద్రపు కోతపై సమగ్ర అధ్యయనం

సముద్రపు కోత సమస్యపై సమగ్రంగా అధ్యయనం చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక తీరానికి ముప్పు కలిగిస్తోందని పేర్కొన్నారు.

పర్యావరణ పరిరక్షణపై ప్రజల అవగాహన

పర్యావరణ పరిరక్షణ, నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రజలు భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉంది.

వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థకు షోకాజ్ నోటీసులు

కాకినాడలోని వీరభద్ర ఎక్స్ పోర్ట్స్ సంస్థ పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించినందుకు 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సంస్థ అనుమతించిన ఉత్పత్తి పరిమితిని మించి ఉత్పత్తి చేయడం మరియు వ్యర్థాలను సరైన విధంగా నిర్వహించకపోవడం గుర్తించారు.

స్వచ్ఛమైన గాలి, నీరు ప్రజల హక్కు

“స్వచ్ఛమైన గాలి, నీరు పొందడం ప్రతి పౌరుడి హక్కు,” అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పారిశ్రామిక కాలుష్యాన్ని గుర్తించడానికి మరియు నిబంధనలను పాటించడం అవసరమని తెలిపారు.

సాగర కాలుష్యం సమస్య

సముద్ర తీరం వెంబడి పరిశ్రమలు శుద్ధి చేయని వ్యర్థాలను సముద్రంలోకి విడవడంతో మత్స్య సంపదకు ముప్పు వాటిల్లుతోందని ఉప ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో పాటు మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని వివరించారు.

పట్టణ మురుగు నీటి నిర్వహణ

మురుగు నీటి నిర్వహణపై సమీక్షలో చర్చించారు. శాస్త్రీయ విధానాల ప్రకారం మురుగు నీటిని నిర్వహించాలన్నరు.

సిమెంట్ కంపెనీల పరిశీలన

పర్యావరణ నిబంధనలను సిమెంట్ కంపెనీలు ఎలా అమలు చేస్తున్నాయో నివేదిక ఇవ్వాలని పీసీబీ అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.

సముద్రపు కోతపై ఆందోళన

ఉప్పాడలో సముద్రపు కోత వల్ల ఏర్పడుతున్న భూభాగ నష్టం గురించి ఉప ముఖ్యమంత్రి చర్చించారు. ఈ సమస్యపై నిపుణులతో అధ్యయనం చేయాలని సూచించారు.

ప్రధాని మోదీ లక్ష్యం

ప్రధాని మోదీ గారి “వికసిత భారత్ 2047” లక్ష్యానికి అనుగుణంగా మన రాష్ట్రం కర్బన ఉద్గారాల తగ్గుదలలో ముందంజలో ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version