మహ్మద్ సిరాజ్‌ను సన్మానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

పేపర్‌డబ్బా న్యూస్ డెస్క్ – అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మొహమ్మద్ సిరాజ్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానం

మంగళవారం ఉదయం టీ-20 వరల్డ్ కప్ గెలుచుకున్న అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న సిరాజ్, ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సిరాజ్ను ఘనంగా సన్మానించారు.

సిరాజ్ ప్రతిభపై ముఖ్యమంత్రి ప్రశంసలు

మహ్మద్ సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నాడని, అందుకే ఈ రోజు అత్యున్నత స్థాయి క్రికెటర్లలో ఒకడుగా పేరు సంపాదించుకున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుండి బహుమతులు

సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగం, ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని వెంటనే గుర్తించాలని, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలసిందిగా అధికారులను ఆదేశించారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో సిరాజ్ ప్రతిభ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానం, బహుమతులు సిరాజ్‌కు మరింత ప్రోత్సాహం కలిగిస్తాయని ఆశిద్దాం.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version