P4 విధానంలో భాగస్వాములు అవ్వాలని సీఐఐ ప్రతినిధులకు విజ్ఞప్తి
సీఐఐ ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఐఐ ప్రతినిధులకు మాట్లాడుతూ, “మిమ్మల్ని ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నాను. 1995లో తొలిసారిగా నేను ముఖ్యమంత్రి అయినప్పుడు సీఐఐ చిన్న సంస్థగా ఉండేది. ఇప్పుడు అదే సీఐఐ పెద్ద సంస్థ. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలిగే సంస్థ. అప్పట్లో ప్రతి ఏడాది సీఐఐ కాన్ఫరెన్స్ నిర్వహించేవాళ్లం,” అని తెలిపారు.
ఈ ఏడాది మరోసారి విశాఖలో సీఐఐ భేటీ
మళ్లీ మనమంతా ఈ సంవత్సంలోనే కలుద్దాం. వాయిదా వేయం. ఏదైనా మేం సకాలంలో చేస్తాం. తర్వాతి మీటింగ్ ఈ ఏడాదే డైనమిక్ సిటీ అయిన విశాఖపట్నంలోనే ఉంటుంది. ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్క నేషనల్ కౌన్సిల్ మెంబర్ ను ఆహ్వానిస్తున్నాను. మాకు పార్లమెంట్, అసెంబ్లీల్లో అత్యధిక మెజార్టీ లభించింది.
ఫిన్ టెక్ హబ్ గా విశాఖను తీర్చిదిద్దుతామని స్పష్టం
గతంలో మేం విశాఖపట్నాన్ని ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాం. లండన్, సింగపూర్ ను మోడల్ గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్ గా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం. మీకెలాంటి రాయితీలు ఇవ్వాలన్న అంశంపై ఆలోచిస్తాం. పరిశ్రమలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాం.
పేదరికం లేని సమాజం తన లక్ష్యం అని వెల్లడి
పబ్లిక్ పాలసీలను నేను బలంగా విశ్వసిస్తాను. ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సంక్షేమం అనేది పేదరికాన్ని పారద్రోలే విధంగా ఉండాలి. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. పేదరికం పోగొట్టేందుకు మనం ఏదైనా చేద్దాం. ఆర్థిక సంస్కరణల తర్వాత ఈరోజు మీ సమక్షంలో పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్ నర్ షిప్ (పీ4) పాలసీని ప్రవేశపెట్టబోతున్నాను. అందరూ బాగా పని చేస్తున్నారు. పీపుల్ అంటే కేపిటల్ అని, ఇతర అంశాలన్నీ కేపిటల్ కు అదనం.
స్కిల్ గణన ద్వారా యువతకు నైపుణ్యాలు అందిస్తాం.. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలు..
మేం స్కిల్ గణన, ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాం. రాష్ట్ర యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. తద్వారా వారు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలను కల్పిస్తాం. అందుకోసం రాష్ట్రంలో స్కిల్ గణన చేపట్టాం.
సంస్కరణలు రాజకీయం గా నష్టం చేసినా ప్రజలకు మంచి చేస్తాయని వెల్లడి
1998లో అమలు చేసిన విద్యుత్ రంగ సంస్కరణల వల్ల నాకు ఎదురుదెబ్బ తగిలినప్పటికీ ఆ సంస్కరణల ఫలితంగానే హైదరాబాద్ విశ్వ నగరంగా నేడు సగర్వంగా నిలబడింది. అది నాకు మంచి పేరుతో పాటు సంతృప్తినిచ్చింది. 1995లో నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని పరిచయం చేశాను. తద్వారా అధిక సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలు ఏర్పాటయ్యాయి. లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వచ్చారు. ఆ రోజు నేను అందరికీ ఒకే మాట చెప్పాను .. ఉద్యోగాల కోసం కాదు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించాను.
రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా
మా రాష్ట్ర సామర్థ్యాలు పరిశీలించి పారిశ్రామికవేత్తలు మంచి ఆలోచనలతో వస్తే కలిసి పనిచేద్దాం. మీరు ఆలోచనలతో వస్తే మేం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. గతంలో మేం విశాఖపట్నాన్ని ఫిన్ టెక్ హబ్ గా తీర్చిదిద్దాం. లండన్, సింగపూర్ ను మోడల్ గా తీసుకొని విశాఖను ఫిన్ టెక్ హబ్ గా మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతాం.