- Advertisement -
- Advertisement -
- Advertisement -
అమరావతి,5 జూలై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఎంఎల్ఏ కోటా ఎమ్మెల్సీలు గా తెలుగుదేశం పార్టీ తరపున సి.రామచంద్రయ్య, జనసేన పార్టీ తరపున పి.హరి ప్రసాద్ లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.విజయరాజు శుక్రవారం అసెంబ్లీ భవనంలో ప్రకటించారు. ఎమ్మెల్యేల కోటా కింద రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి నామినేషన్ల ఉప సంహరణ గడువు శుక్రవారంతో ముగియడంతో కేవలం ఇద్దరు అభ్యర్ధులు అనగా సి.రామచంద్రయ్య, పి.హరిప్రసాద్ లు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో ఇద్దరు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి విజయ రాజు ప్రకటించారు.
- Advertisement -