ఏపీ ప్రకృతి వ్యవసాయం ప్రపంచానికి ఆదర్శం – మంత్రి అచ్చెన్నాయుడు

PaperDabba News Desk: 16 జూలై 2024
ప్రపంచ దేశాలకు మన రాష్ట్ర ప్రకృతి వ్యవసాయం ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 45 దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించడం గర్వకారణం అని అన్నారు. ఇండోనేషియా, శ్రీలంక, జాంబియా, రూవాండ దేశాలకు ఛాంపియన్ రైతులను పంపించి సాంకేతిక మద్దతును సమకూర్చేందుకు RYSS సంసిద్ధంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రపంచ ఆసక్తి

ప్రకృతి వ్యవసాయంలో ఉన్న సైన్స్ ను అర్థం చేసుకోవడానికి వివిధ దేశాల ప్రతినిధులు రాష్ట్రంలో పర్యటించారని మంత్రి అన్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. 15 రాష్ట్రాలకు ఛాంపియన్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ను పంపించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించిన ఏపీ రైతు సాధికార సంస్థ జాతీయ వనరుల సంస్థగా గుర్తింపు పొందింది.

ఏపీకి ప్రతిష్టాత్మక గుర్తింపు

APCNF కార్యక్రమానికి వచ్చిన ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటీ” అవార్డును స్వదేశానికి తిరిగి వచ్చిన రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ & ప్రభుత్వ సలహాదారులు టి. విజయ్ కుమార్, రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ మంత్రి అచ్చెన్నాయుడుని మంగళవారం అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

చరిత్రాత్మక కార్యక్రమం

గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2016 లో రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేశారని, ప్రకృతి వ్యవసాయానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.

మంత్రి రైతు సాధికార సంస్థ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాధించిన ప్రగతిని ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా చేసిన ముఖ్యమంత్రి నాయుడు చొరవను ప్రశంసించారు.

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version