గత కొంత కాలంగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సి కవితను మాజీ మంత్రి హరీష్ రావు కలిసారు. ఆమెతో అయన కాసేపు ముచ్చటించారు. ఆమె యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డిల్లి లిక్కరు స్కాం లో ఆమె ఈ సంవత్సరం మార్చి పదిహేనున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
అనేక మార్లు ఆమె బెయిలు కోసం ప్రయత్నం చేసిన ఆమెకు నిరాశే మిగిలింది. దేనితో ఆమె వంద రోజులగా తీహర్ జైలులోనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు ఒక్కోకరిగా వెళ్లి ఆమెను పరామర్శిస్తున్నారు. ఈ రోజు హరీష్ రావు వెళ్లి కవితను కలిసి జైలులో అందుతున్న సౌకర్యాలు గురించి అడిగి తెలుసుకున్నారు.