తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంతపై చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి. ముఖ్యంగా, సినీ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఆమె చేసిన కామెంట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఆమె ఈ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందిగా మారాయి.
PaperDabba News Desk: October 3, 2024
సినీ సెలబ్రిటీలపై వ్యాఖ్యలు – కాంగ్రెస్‌కు తలనొప్పి
కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్ లీడర్‌గా రాజకీయాల్లో పేరుపొందారు. ఆమె ఎప్పుడూ మాట్లాడినా గౌరవంగా, అందరినీ “అన్నా” అని సంభోదిస్తూ ఉంటారు. అయినప్పటికీ, ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇటీవల వివాదాస్పదంగా మారాయి. ఆమె రాజకీయ జీవితంలో చాలా దశాబ్దాల అనుభవం ఉన్నప్పటికీ, ఈ సారి ఆమె మాటలు కాస్తా అదుపు తప్పాయి.
కటీఆర్‌పై తీవ్ర విమర్శలు రాజకీయ వర్గాల్లో విమర్శలకు దారి తీసింది. ఆమె పేర్లు చెప్పకుండా విమర్శలు చేస్తే అందరూ రాజకీయ విమర్శలుగానే అర్థం చేసుకునేవారు. కానీ, ఆమె నేరుగా వ్యక్తిగతంగా విమర్శించడం, దానికి అసభ్యకరమైన పదాలు ఉపయోగించడం వల్ల ఇప్పుడు ఆమె తనను తాను సమస్యలో పడేసుకున్నారు.
కేటీఆర్‌పై కోపంతో చేసిన వ్యాఖ్యలు
కొండా సురేఖ, తనపై ట్రోలింగ్‌కు స్పందిస్తూ, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించడమే కాకుండా, టాలీవుడ్‌లోని సెలబ్రిటీలను కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సామాన్య ప్రజలకు కూడా అసహ్యం కలిగించాయని, సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మహేష్ బాబు, చిరంజీవి స్పందన
సినీ నటుడు మహేష్ బాబు, మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్లపై తీవ్రంగా స్పందించారు. మహిళా మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని హీరో మహేష్ బాబు అన్నారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను మెగాస్టార్ చిరంజీవి కూడా తీవ్రంగా ఖండించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సెలబ్రిటీలను కించపరిచే విధంగా ఉండటమే కాకుండా, మహిళలను అవమానపరిచేలా ఉన్నాయని విమర్శించారు.
సమంతపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్న కొండా
సినీ నటి సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఆమె సమంతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసి క్షమాపణలు చెప్పారు. తాను ఎట్టి పరిస్థితులలోను సమంతకు మనస్తాపం కలిగించబోనని, ఆమె స్వయంశక్తితో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శమని కొండ సురేఖ ఎక్స్ వేదికగా తెలిపారు.
మొత్తానికి, ఈ వివాదం కొండా సురేఖ రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆమె వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడం కొంత సానుకూలంగా భావించబడుతున్నప్పటికీ, ఈ ఘటన ఆమె కెరీర్‌పై చెడు ప్రభావం చూపనుందనే అభిప్రాయం స్పష్టంగా కనిపిస్తోంది.