ఆంధ్ర ప్రదేశ్ అట్టడుకుపోతుంది. మోడీకి జగన్ లెటర్

PaperDabba News Desk: 19 July 2024
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు అత్యంత భయానకంగా మారాయి. రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయి, పరిపాలనా యంత్రాంగం నిస్సహాయంగా మారింది. ప్రజలు ప్రాణ భయంతో నివసిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వైరవిహారం చేస్తున్నారు, రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.

ప్రతిపక్షంపై లక్ష్యంగా దాడులు

టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుని, ముఖ్యంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించడం ప్రారంభించింది. వారిపై దాడులు, హత్యలు, ఆస్తులు విధ్వంసం చేస్తున్నారు. ఇళ్లను కూల్చేస్తున్నారు, వ్యాపారాలపై దాడులు చేస్తున్నారు. రోడ్డు పక్కనే చిరు వ్యాపారం చేసేవారిపై కూడా దాడులు జరుగుతున్నాయి.

ప్రభుత్వ, ప్రజా ఆస్తులపై దాడులు

ప్రత్యేకంగా ప్రైవేటు ఆస్తులు మాత్రమే కాకుండా, ప్రభుత్వ ఆస్తులపై కూడా దాడులు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ క్లినిక్‌లు కూడా ధ్వంసం చేయబడుతున్నాయి. వైయస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సేవలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు పనిచేస్తున్నాయి. దివంగత నేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.

తాజా ఘటనలు

తాజాగా జూలై 17, 2024 న వినుకొండలో మా పార్టీ కార్యకర్త రషీద్‌ను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ప్రజలను తీవ్ర కలవరపాటుకు గురిచేసింది. మిథున్‌రెడ్డిపై కూడా హత్యాయత్నం జరిగింది. ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో నిత్యకృత్యమైంది.

ప్రజాస్వామ్య వ్యవస్థల క్షీణత

ప్రజాస్వామ్య వ్యవస్థలు, చట్టం, పోలీసు వ్యవస్థలు అన్నీ నిర్వీర్యమయ్యాయి. ‘రెడ్‌ బుక్‌’ రాజ్యాంగం అమలులో ఉంది. దీనితో రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి.

హింసా గణాంకాలు

కేవలం నెల రోజుల్లోనే 31 మంది హత్యకు గురయ్యారు. 300 మంది హత్యాయత్నం ఎదుర్కొన్నారు. 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. 2,700 కుటుంబాలు గ్రామాలు విడిచిపోతున్నాయి. 1,050 దౌర్జన్యాలు, దాడులు జరిగాయి.

కేంద్రం జోక్యం అవసరం

ఈ పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో విచారణ జరపాలని, శాంతిస్థాపన చేయాలని కోరుతున్నాను. ప్రధానమంత్రిగారిని కలిసి వివరణ ఇవ్వాలనుకుంటున్నాను.

మీరు అనుకూలమైన సమయంలో అపాయింట్‌మెంట్‌ ఇవ్వమని విజ్ఞప్తి.

ఇట్లు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

Share This Article
Leave a comment

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

Exit mobile version