ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణకు రాని వారికి తెలంగాణ సిట్ భారీ ఝలక్!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: విచారణకు రాని వారికి తెలంగాణ సిట్ భారీ ఝలక్!
                            టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన కేసులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) బీఎల్ సంతోష్ తో పాటు కొత్తగా నలుగురిని నిందితులుగా చేర్చింది. ఈ కేసులో ముందు నుంచి రామచంద్ర భారతి, సింహయాజి, నంద కుమార్‌లు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీఎల్ సంతోష్‌తో పాటు కేరళకు చెందిన డాక్టర్ జగ్గు స్వామి, బీడీజేఎస్ నేత తుషార్, కరీంనగర్ అడ్వకేట్ బూసారపు శ్రీనివాస్‌లను కూడా నిందితులుగా చేర్చారు. ఈ మేరకు ఏసీబీ కేసుల స్పెషల్ కోర్టులో తాజాగా సిట్ మెమో దాఖలు చేసింది.

వీరు అందరూ విచారణకు రావాలని కొద్ది రోజుల క్రితం సిట్ నోటీసులు జారీ చేసింది. అయినా శ్రీనివాస్ తప్ప మరెవరూ విచారణకు హాజరు కాలేదు. నవంబరు 21, 22 తేదీల్లో శ్రీనివాస్ విచారణకు వచ్చి మూడో రోజు విచారణకు వెళ్లలేదు. హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆయన మళ్లీ విచారణకు వస్తారని అనుకుంటున్నారు. తమ ఎదుట విచారణకు హాజరుకాకుండా తప్పించుకుంటున్నందుకు గానూ వీరిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. కేసులో మొదట్నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బీఎల్‌ సంతోష్‌ను సిట్‌ టార్గెట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్‌ శనివారం లేదా సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేక గడువు కోరతారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం గుజరాత్‌ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు కొంత టైం కావాలని కోరుతూ బీఎల్ సంతోష్‌ సిట్‌ అధికారులకు ఇటీవల లేఖ రాశారు.

సంతోష్‌ను విచారణ చేయొచ్చని, అరెస్ట్‌ విషయంలో కోర్టు పర్మిషన్ మాత్రం తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీఎల్‌ సంతో‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్‌ మెమో దాఖలు చేయడం సంచలనంగా అయింది.

ఎంపీ రఘురామకీ సిట్ నోటీసులుఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు టీమ్ తాజాగా వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకు సీఆర్‌పీసీ 41(ఏ) ప్రకారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 29న సిట్‌ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని పేర్కొంది. రామచంద్ర భారతి, నందుతో రఘురామకు పరిచయం ఉన్నట్లుగా సిట్‌ ఆధారాలు గుర్తించింది. అలాగే అజ్ఞాతంలో ఉన్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి సోదరుడు మనీలాల్‌, జగ్గు వద్ద పనిచేసే విమల్‌, ప్రశాంత్‌, శరత్‌లకు నోటీసులు పంపారు. వీరితోపాటు జగ్గుస్వామి పని చేస్తున్న అమృత ఆస్పత్రి భద్రతా అధికారి ప్రతాపన్‌కు సిట్‌ సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు జారీ చేసింది.News Reels

ఇవి కూడా చదవండి   జోరుగా భారత్ జోడో యాత్ర, నేతలతో పరుగులు పెట్టించిన రాహుల్ గాంధీ!

ఇవాళ విచారణకు హాజరయ్యేవారు వీరే

నేడు సిట్ విచారణకు న్యాయవాది ప్రతాప్ గౌడ్, నంద కుమార్ భార్య చిత్రలేఖ హాజరు కానున్నారు. నంద కుమార్ తో, సింహ యాజీ, రామచంద్ర భారతిలతో ఉన్న సంబంధాలపై ప్రతాప్ గౌడ్ ను సిట్ ప్రశ్నించనుంది. నంద కుమార్ కు సంబంధించిన వివరాలపై చిత్రలేఖను సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.