లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?

లవ్ టుడే రివ్యూ: ఈ తరం ప్రేమకథ ఆకట్టుకుందా? ప్రదీప్ అరుదైన జాబితాలో చేరాడా?
లవ్ టుడే

Romance, Drama, Comedy

దర్శకుడు: ప్రదీప్ రంగనాథన్

Artist: ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులు

సినిమా రివ్యూ : లవ్ టుడే (డబ్)రేటింగ్ : 3.5/5నటీనటులు : ప్రదీప్ రంగనాథన్, ఇవానా, యోగిబాబు, సత్యరాజ్, రాధిక తదితరులుఛాయాగ్రహణం : దినేష్ పురుషోత్తమన్సంగీతం: యువన్ శంకర్ రాజానిర్మాణ సంస్థ : ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్తెలుగులో పంపిణీ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (దిల్ రాజు)కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ప్రదీప్ రంగనాథన్విడుదల తేదీ: నవంబర్ 25, 2022

తమిళనాట పెద్దగా అంచనాల్లేకుండా వచ్చి సంచలన విజయం సాధించిన సినిమా ‘లవ్ టుడే’. ఈ సినిమా తమిళ వెర్షన్ చూసిన దిల్ రాజు దీన్ని రీమేక్ చేస్తే ఆ మ్యాజిక్ వర్కవుట్ అవ్వదని, అందుకే డబ్ చేస్తున్నానని చెప్పడంతో దీనిపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హిలేరియస్‌గా కట్ చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మరి సినిమా ఎలా ఉంది?

కథ: ఉత్తమన్ ప్రదీప్ (ప్రదీప్ రంగనాథన్), నికిత (ఇవానా) ఒకరినొకరు ఇష్టపడతారు. నికిత తండ్రి వేణు శాస్త్రి (సత్యరాజ్) చాలా స్ట్రిక్ట్.  అనుకోకుండా ఒకరోజు వీరి ప్రేమ విషయం ఆయనకు తెలిసిపోతుంది. ప్రదీప్‌ను కలవడానికి ఇంటికి పిలుస్తాడు. ఏవో ఊహించుకుని వచ్చిన ప్రదీప్‌కు వేణు శాస్త్రి ఊహించని షాక్ ఇస్తాడు. ప్రదీప్, నికితలు ఒకరోజు వారి స్మార్ట్ ఫోన్లను మార్చుకోవాలని, తర్వాతి రోజు అదే సమయానికి కూడా వారిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్తాడు. దీంతో వారిద్దరూ తమ ఫోన్లు మార్చుకుంటారు. ఆ ఒక్కరోజులో ఏం జరిగింది? ఒకరి ఫోన్‌లో మరొకరికి నమ్మలేని రహస్యాలు ఏం కనిపించాయి? 24 గంటల తర్వాత వారు పెళ్లి చేసుకోవాలనుకున్నారా? తెలియాలంటే ఈ క్రేజీ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.

విశ్లేషణ: ‘నాకు నీ గురించి మొత్తం తెలుసు బేబీ. ఐ లవ్యూ’ అనే మాట నుంచి ‘నాకు నీ గురించి మొత్తం తెలుసనుకున్నాను. కానీ అస్సలేమీ తెలీదని అర్థం అయింది. అయితే ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను.’అనే మాట వరకు జరిగే ప్రయాణమే ‘లవ్ టుడే’. ప్రదీప్ రంగనాథన్ 2017లో తీసిన ‘అప్పా లాక్’ అనే నాలుగు నిమిషాల షార్ట్ ఫిల్మ్ ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చాలంటే అయితే వావ్ అనిపించేలా ఉండాలి, లేకపోతే తనకు తాను రిలేట్ చేసుకునేలా ఉండాలి. ‘లవ్ టుడే’ రెండో కేటగిరిలోకి వచ్చే సినిమా.News Reels

ఇవి కూడా చదవండి   డ్రమ్ముపై అందాల బొమ్మ - సన్నీలియోన్ ‘కౌ-గర్ల్’ సవారీ

స్మార్ట్ ఫోన్ సీక్రెట్స్ అనే కాన్సెప్ట్‌ను తీసుకోవడంలోనే ప్రదీప్ సగం సక్సెస్ అయ్యాడు. ఎందుకంటే చాలా మంది స్మార్ట్ ఫోన్లలో తమ గురించి తమకు తప్ప ఎవరికీ తెలియని రహస్యాలు ఉంటాయి. అవి బయట పడితే ఊహించని పరిణామాలు ఎదురు కావచ్చు. దాదాపు ప్రతి ఒక్కరూ రిలేట్ చేసుకునే సబ్జెక్ట్ ఇది. సినిమా చాలా నెమ్మదిగా ప్రారంభం అవుతుంది. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్, అది అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడానికి ప్రదీప్ అరగంట సమయం తీసుకున్నాడు. అక్కడివరకు కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. అయితే కథలోని అన్ని కీలక పాత్రల పరిచయం అప్పటికే అయిపోవడంతో ఫోన్లు ఎక్స్‌చేంజ్ చేసుకున్న దగ్గర నుంచి కథనం పరుగులు పెడుతుంది.

ఫోన్లు మార్చుకున్నాక ఒకరి గురించి రహస్యాలు మరొకరికి తెలిసిపోవడం, వాటి నుంచి కలిగే ఫ్రస్ట్రేషన్ విపరీతమైన ఫన్‌ను జనరేట్ చేస్తుంది. ఈ సన్నివేశాలు యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రీ-ఇంటర్వెల్ సీన్‌లో ప్రదీప్ రంగనాథన్, సత్యరాజ్ రెండోసారి కలిసే సీన్ మంచి హిలేరియస్‌గా వచ్చింది. సెకండాఫ్ కూడా దాదాపు ఇంతే హిలేరియస్‌గా సాగుతుంది. కానీ ఆఖరి అరగంటను మాత్రం ప్రదీప్ ఎమోషన్‌తో నింపేశాడు. హీరోయిన్‌తో రెస్టారెంట్‌లో గొడవ పడే సీన్ దగ్గర నుంచి సినిమా టోన్ పూర్తిగా ఎమోషనల్ అయిపోతుంది. అయితే ఆ ఎమోషన్‌కు ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారు. చివరి 10 నిమిషాల్లో హీరో, హీరోయిన్లు బీచ్‌లో కూర్చుని మాట్లాడుకునే సన్నివేశం హృదయానికి హత్తుకుంటుంది.

సినిమాకు మరో పెద్ద ప్లస్ యోగిబాబు పాత్ర. తను రెగ్యులర్‌గా చేసే కామెడీ పాత్రలు కాకుండా ఇందులో కొంచెం డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర లభించింది. చివరి అరగంటలో యోగి బాబు, ప్రదీప్‌ల మధ్య వచ్చే సీన్ ఆకట్టుకుంటుంది. ‘ఒక విషయాన్ని దాస్తున్నామంటే అది ఇతరులకు తెలియకూడదని అర్థం. అది తప్పు అవ్వాల్సిన అవసరమే లేదు.’ అంటూ అర్థవంతమైన డైలాగ్స్ కూడా యోగిబాబుతో చెప్పించాడు ప్రదీప్.

అయితే సినిమాలో అక్కడక్కడా కొంచెం మైనస్‌లు కూడా ఉన్నాయి. మొదటి అరగంట సినిమా కాస్త స్లోగా సాగుతుంది. ఇక చివర్లో హీరో రియలైజేషన్ ఎమోషనల్‌గా ఆ సమయానికి అదే కరెక్ట్ అనిపించినా, అంతకుముందు సన్నివేశాలకు తను ఇచ్చిన హార్డ్ రియాక్షన్ల కారణంగా ఇంత త్వరగా మార్పు వచ్చేసిందా అనిపిస్తుంది.

సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం. మంచి అసెట్ ‘పిల్లా పడేశావే’, ‘ప్రాణం పోతున్నా’ పాటలు లూప్‌లో వినేంత నచ్చుతాయి. కామెడీ సీన్లలో మరింత నవ్వు వచ్చేలా, ఎమోషన్ సీన్లకు మరింత వెయిట్ అందించేలా ఇచ్చిన రీ-రికార్డింగ్ ఆకట్టుకుంటుంది. ప్రదీప్ ఈ.రాఘవ్ ఎడిటింగ్ కొంచెం షార్ప్‌గా ఉంటే బాగుండేది. దినేష్ పురుషోత్తమన్ విజువల్స్‌ను తెరపై అందంగా చూపించారు.

ఇవి కూడా చదవండి   పింక్ గులాబీలా మెరిసిపోతున్న బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి

ఇక నటీనటుల విషయానికి వస్తే… ఈ సినిమా ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో. ఇక నుంచి ప్రదీప్ నుంచి ఒక సినిమా వస్తుందంటే తెలుగులో కూడా ఆడియన్స్ ఆ సినిమా కోసం వెయిట్ చేస్తారు. ఒక కథకు దర్శకత్వం వహిస్తూ, అందులో హీరోగా నటించి మెప్పించడం అంత సులువైన పని కాదు. కానీ ఇటీవల ‘కాంతార’తో రిషబ్ శెట్టి, ‘లవ్ టుడే’తో ప్రదీప్ రంగనాథన్ దాన్ని చేసి చూపించారు. ఒక సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించి సూపర్ హిట్ కొట్టిన అరుదైన జాబితాలో ప్రదీప్ రంగనాథన్ కూడా చేరారు. హీరోయిన్ ఇవానాకు ప్రాధాన్యం ఉన్న పాత్ర దొరికింది. తన పాత్రలో ఎమోషన్స్‌ను చక్కగా పండించింది. యోగి బాబు ఆకట్టుకుంటాడు. సత్యరాజ్, రాధిక, మిగతా నటీనటులందరూ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే… ‘లవ్ టుడే’ అన్ని వయసుల వారిని ఆకట్టుకునే సినిమా. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బ్యాచ్‌లా వెళ్తే మాత్రం పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు.

Also Read : ‘ఝాన్సీ’ వెబ్ సిరీస్ రివ్యూ : లేడీ గజినీలా మారిన అంజలి – సిరీస్ ఎలా ఉందంటే?

Also Read : ‘అహ నా పెళ్ళంట’ వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?