హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్, అద్దాల భవంతుల మధ్యలో ఒంపులు తిరుగుతూ వయ్యారిలా!

హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్, అద్దాల భవంతుల మధ్యలో ఒంపులు తిరుగుతూ వయ్యారిలా!
                                                                                                                                        హోమ్                        ఫోటో గ్యాలరీ      &nbsp/ హైదరాబాద్                  In Pics: హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్, అద్దాల భవంతుల మధ్యలో ఒంపులు తిరుగుతూ వయ్యారిలా!                                                                    By : ABP Desam | Updated: 25 Nov 2022 09:17 AM (IST) 

మంత్రి కేటీఆర్ నేడు గచ్చిబౌలి ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు GHMC మరో ఫ్లై ఓవర్ బ్రిడ్జి సిద్ధం చేసింది.

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఈరోజు ప్రారంభించనున్నారు.

స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ (SRDP) ప్రోగ్రామ్ ద్వారా చేపట్టిన పలు పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి.

ఐకియా ఫ్లై ఓవర్‌ నుంచి డెలాయిట్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ మీదుగా గచ్చిబౌలి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పైకి వెళ్లేలా రూ.313.52 కోట్లతో ఈ కొత్త ఫ్లైఓవర్ నిర్మించారు.

జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబరు 45 నుంచి కేబుల్ బ్రిడ్జి ఫ్లైఓవర్ ఎక్కేసి బయలుదేరి ఐకియా ఫ్లైఓవర్ మీదుగా ఈ కొత్త ఫ్లైఓవర్‌ ఎక్కితే నేరుగా ఔటర్‌ రింగ్ రోడ్డుపై దిగొచ్చు.

ఇప్పటికే గచ్చిబౌలి జంక్షన్ వద్ద ఉన్న పాత ఫ్లై ఓవర్‌ కి మరింత పై నుంచి నిర్మించిన ఈ కొత్త ఫ్లై ఓవర్‌ చూపరులను ఆకర్షిస్తోంది.

1.75 కిలోమీటర్ల పొడవుతో దీనిని నిర్మించారు. ఎస్‌ఆర్‌డీపీ పథకంలో భాగంగా సిద్ధమైన 17వ ఫ్లైఓవర్ ఇది.

ఎగువ ర్యాంపు ORR నుంచి శిల్పా లే అవుట్‌ ఫ్లై ఓవర్‌ వరకు 458.64 మీటర్ల వెడల్పు, శిల్పా లే అవుట్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు దిగువ ర్యాంపు ఫ్లై ఓవర్‌ 399.952 మీటర్ల వెడల్పుతో 2 ఫ్లై ఓవర్‌లను చేపట్టారు.

                                                                            Tags:                            KTR News                            Minister KTR                            Silpa layout Flyover                            Gachibowli junction                             Gachibowli Flyover                     
ఇవి కూడా చదవండి   కాంగ్రెస్‌కు మర్రి శశిధర్ రాజీనామా, పార్టీ గురించి కీలక వ్యాఖ్యలు