కొత్తిమీరతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చా?

కొత్తిమీరతో థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చా?
                            ధనియాలు, కొత్తిమీర లేని వంటిల్లు ఉండదు. ప్రతి ఒక్కరూ తమ వంటలకి అదనపు రుచి ఇవ్వడం కోసం చివర్లో ఖచ్చితంగా కొత్తిమీర వేసుకుంటారు. దాని రుచి, వాసన కూరలకి అదనపు రుచి జోడిస్తుంది. ఇక నాన్ వెజ్ వంటకాల్లో తప్పనిసరిగా ధనియాల పొడి వాడుతూ ఉంటారు. ధనియాలు వంటలకి రుచి ఇవ్వడమే కాదు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. ధనియాల నీళ్ళు తాగడం వాళ్ళ థైరాయిడ్ గ్రంథి పని తీరు మెరుగుపడటమే కాదు బరువు తగ్గించడంలోని కీలకంగా వ్యవహరిస్తుంది. వీటిలో ఫైబర్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అవి జీర్ణక్రియ, ఖనిజాల శోషణని మెరుగుపరుస్తాయి. దాని వల్ల మానసిక స్థితి కూడా మెరుగుపడుతుంది.

కొత్తిమీరలో విటమిన్ ఏ, సి, కె, ఫోలేట్ అధికంగా ఉంటాయి. ధనియాల కంటే కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ ద్వారా కణాలని దెబ్బతినకుండా కాపాడతాయి.

థైరాయిడ్ గ్రంథికి మేలు

ప్యాంక్రియాస్, కాలేయం వంటి అన్ని ఇతర ఎండోక్రైన్ గ్రంధుల మాదిరి గానే థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్లు  నేరుగా రక్తప్రవాహంలోకి విడుదల అవుతాయి. థైరాయిడ్ గ్రంథి హార్మోన్ తక్కువ స్రవిస్తే దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. అదే గ్రంథి అతిగా స్రవిస్తే హైపర్ థైరాయిడిజం అంటారు. జీవక్రియని నియంత్రించే హార్మోన్లు థైరాయిడ్ గ్రంథి విడుదల చేస్తుంది. గుండె, మెదడు, కాలేయం, మూత్రపిండాలు, వాస్కులర్ వ్యవస్థ, రక్తపోటు, జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మీద దీని ప్రభావం పడుతుంది. బరువు పెరగడం, డిప్రెషన్, అలసట, మలబద్ధకం వంటి సమస్యలు హైపో థైరాయిడిజం వల్ల వస్తాయి. బరువు తగ్గడం, ఆందోళన, డయేరియా, దడ, జుట్టు పెళుసుగా మారిపోవడం, పొడి చర్మం వంటివి హైపర్ థైరాయిడిజం లక్షణాలు.

థైరాయిడ్ సమస్యకి కొత్తిమీర నీళ్ళు

థైరాయిడ్ సమస్యకి కొత్తిమీర నీళ్ళు గొప్ప నివారణగా చెప్పొచ్చు. జీర్ణక్రియని మెరుగు పరిచి, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి, మూత్రపిండాలని ఇది శుద్ధి చేస్తుంది. థైరాయిడ్ ని సహజంగా నయం చెయ్యడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.News Reels

కొత్తిమీర లేదా ధనియాల నీళ్ళు తాగడం వల్ల ప్రయోజనాలు

⦿ బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

⦿ తిమ్మిరి, అతిసారం, వాంతులు, వికారం వంటి జీర్ణ సమస్యల్ని నివారిస్తుంది.

⦿ పొట్ట ఉబ్బరం, పేగు కదలికలు సక్రమంగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి   ఈ ఆహారం తింటే అస్సలు ముసలోళ్లే కారు, ఏ వయస్సులో ఏం తీసుకోవాలంటే..

⦿ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

⦿ శరీరం నుంచి విషయాన్ని తొలగిస్తుంది.

⦿ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది.

⦿ ఫోలిక్యులర్ డ్యామేజ్, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. జుట్టు చిక్కగా పెరిగేలా సహాయపడుతుంది.

⦿ చర్మ సమస్యలని నయం చేస్తుంది. మొటిమలు, పిగ్మెంటేషన్ సమస్యలని తగ్గిస్తుంది.

క్రమం తప్పకుండా కొత్తిమీర నీళ్ళు తాగడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. దీన్ని చాలా సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఉదయం పరగడుపున ఈ నీళ్ళు తాగితే ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. కాస్త తేనె జోడించి కూడా ఈ నీళ్ళని తాగొచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: చలికాలంలో ఈ పానీయాలు తీసుకుంటే అందం, ఆరోగ్యం మీ సొంతం