ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – Keystone Realtors లిస్టింగ్‌ నేడే

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి – Keystone Realtors లిస్టింగ్‌ నేడే
                            <strong>Stocks to watch today, 24 November 2022:</strong> ఇవాళ (గురువారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్‌ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్‌ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 97 పాయింట్లు లేదా 0.53 శాతం గ్రీన్‌ కలర్‌లో 18,474 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది. 

నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి:

కీస్టోన్ రియల్టర్స్‌: రుస్తోమ్‌జీ గ్రూప్‌లోని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ, దలాల్ స్ట్రీట్‌ ప్రయాణాన్ని ఇవాళ ప్రారంభించనుంది. నవంబర్ 14-16 తేదీల మధ్య జరిగిన IPOలో రూ. 514-541 ధర శ్రేణిలో షేర్లను జారీ చేసి రూ. 635 కోట్లను సమీకరించింది. ఈ ఇష్యూ రెండు రెట్లకు పైగా స్పందన అందుకుంది.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో): ఇస్తాంబుల్ మీదుగా పోర్చుగల్, స్విట్జర్లాండ్‌కు విమాన సేవలను ప్రారంభించింది.  టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో కోడ్‌షేర్ భాగస్వామ్యంతో సర్వీసులు అందిస్తోంది. ఈ కొత్త రూట్‌లు, ఫ్రీక్వెన్సీలు నవంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చాయి. News Reels

BASF ఇండియా: అలెగ్జాండర్ గెర్డింగ్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఈ కెమికల్స్ ప్లేయర్ నియమించింది. జనవరి 1, 2023 నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది. ప్రస్తుతమున్న నారాయణ్ కృష్ణమోహన్ స్థానంలో గెర్డింగ్ బాధ్యతలు తీసుకుంటారు. వచ్చే ఐదేళ్ల పాటు ఆ సీట్‌లో గెర్డింగ్ ఉంటారు.

ఐనాక్స్ లీజర్: ఆపరేటర్ 15 నగరాల్లోని 22 మల్టీప్లెక్స్‌లలో FIFA వరల్డ్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను ప్రదర్శించనున్నట్లు ఐనాక్స్ లీజర్ ప్రకటించింది. ప్రస్తుత FIFA ప్రపంచ కప్‌లో 40 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఇది ఈ వారం ప్రారంభంలో ప్రారంభమై డిసెంబర్ 18న ముగుస్తుంది.

అపోలో టైర్స్‌: టైరోమర్ ఇంక్‌తో (Tyromer Inc) ముడిసరుకు సరఫరా ఒప్పందాన్ని ప్రకటించింది. పర్యావరణహిత ప్రక్రియలను ఉపయోగించి ఉత్పత్తి చేసిన పునర్వినియోగ రబ్బరు పదార్థాన్ని ఈ కంపెనీ సరఫరా చేస్తుంది.

క్యాన్ ఫిన్ హోమ్స్: FY23కి ‘మధ్యంతర డివిడెండ్’ చెల్లింపు ప్రతిపాదనను పరిశీలించడానికి ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 28న సమావేశం కాబోతోంది. మధ్యంతర డివిడెండ్ చెల్లింపు కోసం రికార్డు తేదీని కూడా వారు నిర్ణయిస్తారు.

జైడస్‌ లైఫ్‌సైన్సెస్‌: కడుపులో, ప్రేవుల్లో పూతల చికిత్సకు ఉపయోగిస్తున్న ఫామోటిడైన్ ఇంజెక్షన్‌కు జెనరిక్ వెర్షన్‌ను మార్కెట్ చేయడానికి US హెల్త్ రెగ్యులేటర్ USFDA నుంచి ఈ కంపెనీకి తుది ఆమోదం వచ్చింది. 40mg/4mL, 200mg/20mL మల్టిపుల్ డోస్ వైల్స్‌లో ఉత్పత్తి చేసే ఫామోటిడైన్ ఇంజెక్షన్ కోసం ఈ అనుమతి లభించింది.

ఇవి కూడా చదవండి   పెరగనూలేదు, తగ్గనూలేదు - స్థిరంగా పసిడి రేటు, వెండిలోనూ ఊగిసలాట

KPIT టెక్నాలజీస్: ఫ్రెంచ్ ఆటో గ్రూప్ రెనాల్ట్, తన నెక్ట్స్ జెనరేషన్‌ సాఫ్ట్‌వేర్-డిఫైన్డ్ వెహికల్ ప్రోగ్రామ్ కోసం వ్యూహాత్మక సాఫ్ట్‌వేర్ స్కేలింగ్ భాగస్వామిగా KPIT టెక్నాలజీస్‌ను ఎంపిక చేసుకుంది. KPITకి ఆటోమోటివ్, మొబిలిటీ సాఫ్ట్‌వేర్, క్రాస్-డొమైన్ కాంపిటెన్సీస్‌, గ్లోబల్ స్కేల్ వంటి అంశాల్లో KPIT టెక్నాలజీస్‌కు రెండు దశాబ్దాల అనుభవం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.