చైతూతో శోభితా డేటింగ్ రూమర్స్ నిజమేనా? ఆ వైరల్ ఫొటో చూస్తే మీకు అదే అనిపిస్తుంది!

చైతూతో శోభితా డేటింగ్ రూమర్స్ నిజమేనా? ఆ వైరల్ ఫొటో చూస్తే మీకు అదే అనిపిస్తుంది!
                            <strong>సోషల్ మీడియాలో మార్మోగుతున్న శోభిత- నాగచైతన్య డేటింగ్ వార్తలు </strong>

గడిచిన కొద్ది రోజులుగా శోభిత ధూళిపాళ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవలే పొన్నియిన్ సెల్వన్-1 సినిమాలో శోభిత కనిపించింది. గత కొంత కాలంగా నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. ఇద్దరు కలిసి పక్కపక్కనే నిల్చొని దిగిన ఫోటో రెండుగా కట్ చేసి పోస్టు చేసినట్లుగా కనిపిస్తోంది. ఈ ఫోటో వీరి డేటింగ్ రూమర్స్ కు బలం చేకూర్చేలా ఉంది.  

Ahaaaa !!! Official chesela unnaru ga twaralone 😳 pic.twitter.com/sgVmhXCv1Y<strong>News Reels</strong>

— S!D 🧘 (@OptimistSiD) November 24, 2022

 డేటింగ్ వార్తలపై స్పందించిన శోభిత, సమంతా

శోభితా ధూళిపాళ – నాగ చైతన్య ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్నారట. త్వరలోనే వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి డేటింగ్ రూమర్స్ పై సమంత కూడా స్పందించింది. ప్రస్తుతం తమ పనుల్లో తాము హ్యాపీగా ఉన్నామని, ఇలాంటి రూమర్లు ఆపాలంటూ ఆమె ట్వీట్ చేసింది. డేటింగ్ వార్తలపై తాజాగా శోభిత ట్విట్టర్ వేదికగా ఓ వీడియో షేర్ చేసినట్లు కొద్ది రోజులు కిందట ఓ వార్త వైరల్‌గా చక్కర్లు కొట్టింది. అందులో ఆమె మిడిల్ ఫింగర్ చూపిస్తూ, డేటింగ్ రూమర్లపై మండిపడినట్లుగా ఆ పోస్టులో పేర్కొన్నారు. 

ఇప్పటి వరకు నోరు విప్పని నాగచైతన్య

అటు సమంత, ఇటు శోభిత డేటింగ్ వార్తలపై స్పందించినా, నాగ చైతన్య ఎలాంటి కామెంట్స్ చేయలేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. వరుస సినిమాలో బిజీగా ఉన్నాడు. తాజాగా బాలీవుడ్ మూవీ  ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో నటించినా, ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది. తాజాగా మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన ఇటీవల వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. ఇక శోభితా ధూళిపాళ ‘గూఢచారి’, ‘మేజర్’ సినిమాల్లో నటించింది. అయినా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

                View this post on Instagram                                  A post shared by Sobhita Dhulipala (@sobhitad)

  <strong>Read Also: అయ్య బాబోయ్, ‘అవతార్-2’ టికెట్లు అంత ఖరీదా? ధర తెలిస్తే ‘సినిమా’ కనిపిస్తాది!</strong>
ఇవి కూడా చదవండి   సమంతకు కాంపిటీషన్ గా మారిన ప్రభాస్ -