మీ కళ్లు ఇలా మారుతున్నాయా? జాగ్రత్త, క్యానర్స్ కావచ్చు!

మీ కళ్లు ఇలా మారుతున్నాయా? జాగ్రత్త, క్యానర్స్ కావచ్చు!
                            <strong>ప్ర</strong>పంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. చాలా రకాల క్యాన్సర్లలో ప్రాథమిక స్థాయిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. దాని వల్ల మరణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటి క్యాన్సర్స్ లో ఒకటి ప్రాంక్రియాస్ క్యాన్సర్. ఈ క్యాన్సర్ లో కూడా ప్రాథమిక స్థాయిలో పెద్ద లక్షణాలేవీ కనిపించవు. కానీ చాలా దగ్గరగా గమనిస్తే కొన్ని చిన్నచిన్న సమస్యలను గమనించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

పాంక్రియాస్ క్యాన్సర్ నిర్ధారణ కావడానికి ముందు చాలా మందిలో కామెర్ల సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యలో చర్మం, కను గుడ్డులోని తెలుపు భాగం పసుపు రంగులోకి మారుతుంది. మూత్రం కూడా ముదురు రంగులో ఉంటుంది. మలం మామూలు కంటే లేతరంగులో ఉంటుంది. పాంక్రియాస్ గ్రంథి తలభాగంలో క్యాన్సర్ మొదలైనపుడు తప్పని సరిగా కామెర్లు వస్తాయి. ఎందుకంటే పైత్య నాళం క్యాన్సర్ ట్యూమర్ తో మూసుకుపోవడం వల్ల ఇలా జరుగుతుంది. పైత్య నాళం ద్వారా పైత్య రసం చిన్న ప్రేవులోకి స్రవిస్తుంది. కానీ ఈ నాళం మూసుకుపోవడం వల్ల పైత్య రసానికి అడ్డమవుతుంది. దానివల్ల ఈ పైత్యరసం నేరుగా మూత్రంలో కలుస్తుంది. ఫలితంగా మూత్రం పసుపు రంగులో ఉంటుంది. పేగుల్లో పైత్యరసం వెళ్లక పోవడం వల్ల మలం లేత రంగులో ఉంటుంది. పైత్య రసంలో పసుపు రంగు ఉంటుంది కనుక చర్మం పసుపు రంగులోకి మారుతుంది. ఇది కాస్త రంగు తక్కువగా ఉన్న వారిలో అంత గుర్తించేవిధంగా ఉండకపోవచ్చు. కామెర్లతో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.

కడుపు లేదా నడుము నొప్పి

పాంక్రియాస్ క్యాన్సర్ తో బాధపడుతున్న వారిలో దాదాపు 70 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తుందట. ఈ క్యాన్సర్ వల్ల కడుపు లేదా నడుము నొప్పితో బాధపడతారట. 

అకారణంగా బరువు తగ్గడం

పాంక్రియాస్ క్యాన్సర్ కొత్తగా నిర్థారణ అయిన వారిలో ఈ మధ్య కాలంలో వారి బరువులో 10 శాతం వరకు తగ్గినట్టుగా గుర్తించారు. ఎలాంటి ప్రయత్నం లేకుండా ఇలా బరువు తగ్గుతారు.News Reels

డయాబెటిస్

ఈ సమస్య నిర్ధారణ కావడానికి ముందు చాలా మందిలో డయాబెటిస్ సమస్య వస్తుంది. క్యాన్సర్ నిర్ధారణకు సంవత్సరం ముందుగానే డయాబెటిస్ సమస్య రావచ్చు. షుగర్ అదుపులో ఉండకపోవడం వల్ల ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చెయ్యాల్సి రావడం, దాహంగా ఉండడం, ఆకలి ఎక్కువగా ఉండడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. 

ఇవి కూడా చదవండి   సైనసైటిస్ రావడానికి ఎన్నో కారణాలు, అందులో ధూమపానం కూడా ఒకటి - చికిత్స ఇలా

కళ్ల తిరగడం

ఈ క్యాన్సర్ వల్ల కొందరికి చర్మం దురద కూడా రావచ్చు.  కొంత మందిలో తరచుగా కళ్లు తిరుగుతున్నట్టుగా ఉండొచ్చు అందుకు కారణం కామెర్లు, పాంక్రియాస్ లో వచ్చిన వాపు అని నిపుణులు అంటున్నారు.

స్టిటోరియా

పైత్య నాళం మూసుకు పోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇందులో చాలా ఎక్కువ మొత్తంలో దుర్వాసనతో కూడిన మలం విసర్జన జరుగుతుంది.

జ్వరం, వణుకు

కామెర్లు, పాంక్రియాస్ లో వాపు ఉండడం వల్ల తరచుగా జ్వరం వస్తుంది. జ్వరం ఎక్కువగా ఉన్నపుడు చలిగా ఉండి వణుకు కూడా రావచ్చు.

అజీర్ణం

చాలామందిలో ఇది క్యాన్సర్ లక్షణం కాకపోవచ్చు కానీ తరచుగా సమస్య ఎదురవుతూ ఎలాంటి మందులకు తగ్గకపోతే మాత్రం తప్పని సరిగా డాక్టర్ ను సంప్రదించాలి.

రక్తం గడ్డకట్టడం

ఈ క్యాన్సర్ వల్ల రక్త స్కందన సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న రక్త నాళాల్లో ఇలా రక్తం గడ్డకడుతుంది. ఒక్కోసారి ఇవి వాటంతటవే మాయం అవుతాయి. మరోచోట ఏర్పడుతుంటాయి. ఎండోక్రైన్ పాంక్రియాటిక్ ట్యూమర్ ఉన్నపుడు లక్షణాలు కనుగొనడం చాలా కష్టం. ఎందుకంటే వీటిలో చాలా వాటి నుంచి హార్మోన్ల ఉత్పత్తి జరగదు. అందువల్ల ప్రత్యేకంగా లక్షణాలు కనిపించవు. ఈ లక్షణాలన్నీ కూడా ఇతర అనారోగ్యాల వల్ల కూడా కావచ్చు. కానీ ఈ లక్షణాలకు కారణం ఏమిటనేది నిర్ధారించుకోవడం మాత్రం తప్పనిసరి. కొత్త లక్షణం ఏదైనా కనిపించి అది అంత త్వరగా తగ్గకపోతే మాత్రం నిర్లక్ష్యం పనికి రాదని నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.