మళ్లీ ఆస్పత్రిపాలైన సమంత? ఆమె టీమ్ ఏం చెప్పారంటే..

మళ్లీ ఆస్పత్రిపాలైన సమంత? ఆమె టీమ్ ఏం చెప్పారంటే..
                            <strong>టా</strong>లీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆరోగ్యం పై గత కొన్ని రోజులుగా వరుసగా కథనాలు వస్తున్నాయి. ఇటీవల సామ్ మయోసైటిస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. కొన్నాళ్ళు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. అయితే సామ్ మళ్ళీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరినట్లు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వ్యాధి ముదిరి మళ్ళీ ఆసుపత్రి పాలైందనే వార్త ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. అయితే దీనిపై ఆమె కుటుంబ సభ్యులు స్పందించారు. ఆమె ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. సామ్ ఆరోగ్యం పై ఆమె మేనేజర్ కూడా వివరణ ఇచ్చారు. సామ్ ఆరోగ్యంపై వస్తున్నవి ఫేక్ న్యూస్ లు అని స్పష్టం చేశారు. ఇలాంటి వార్తలను నమ్మొద్దన్నారు.  కాగా కొద్ది రోజులుగా సామ్ మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతోన్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. దీంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. సామ్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు కూడా చేశారు. అయితే సమంత అనారోగ్యంతో ఉన్నప్పటికీ యశోద సినిమాకు తానే డబ్బింగ్‌ చెప్పింది. ఆ ఫోటో లు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. 'యశోద' సినిమా నవంబర్ 11 న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో సామ్ నటన, ఫైట్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాతో సమంత క్రేజ్ మరింత పెరిగింది. 

అయితే ఇండస్ట్రీలో సెలబ్రెటీల విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు విపరీతంగా వస్తున్నాయి. గతంలో కూడా ఈ ఫేక్ వార్తలు వచ్చినా.. వాటిని అంతగా పట్టించుకునే వారు కాదు. అయితే ఇప్పుడు తమపై వస్తోన్న పుకార్లకు వాళ్లే స్వయంగా పుల్‌స్టాప్ పెడుతున్నారు. ఇటీవల సినీ హీరో శ్రీకాంత్ పై ఇలాగే ఫేక్ వార్తలు సర్కులేట్ అయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు వల్ల శ్రీకాంత్ ఆయన భార్య ఊహ విడాకులు తీసుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఇటీవలే వీటిపై శ్రీకాంత్ స్పందించారు. తాము ఆనందంగా ఉన్నామని, విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముందని అన్నారు. గతంలో కూడా తాను చనిపోయినట్లు వార్తలు రాశారని మండిపడ్డారు. ఇలాంటి ఫేక్ వార్తలు నమ్మొద్దన్నారు. 

అలాగే నటి మమతా మోహన్ దాస్ కూడా మళ్లీ క్యాన్సర్ బారిన పడిందంటూ వచ్చిన వార్తలపై స్పందించారు. తనకు ఎలాంటి క్యాన్సర్ లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. స్వలాభం కోసం ఒకరిపై అబద్ధాలు ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. ఇలా చాలా మంది సెలబ్రెటీలు తమపై వస్తోన్న ఫేక్ వార్తలను ఖండించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు సమంత విషయంలోనూ అదే జరిగింది. మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకోవడంతో ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది. ప్రస్తుతం సమంతా ‘యశోద’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. 

ఇవి కూడా చదవండి   బాపు బొమ్మ స్నేహ ఎంత ముచ్చటగా ఉందో చూశారా?

Read Also: కమల్ హాసన్‌కు అస్వస్థత, హైదరాబాద్ నుంచి వెళ్లగానే హాస్పిటల్‌కు తరలింపు!News Reels