ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు!

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు!
                            Mlas Bribery Case : ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టేవేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. గతంలో రెండ్రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చిన న్యాయస్థానం, మరోసారి తాజాగా కస్టడీకి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఇక ఈ కేసులో తాజాగా మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేకు ఎర కేసులో ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి  రెండు పాస్‌పోర్టులు ఉన్నట్లు తేలడం సంచలనం రేపుతోంది. స్వామిజీ రామచంద్రభారతి పేరుతో ఒకటి.. భరత్‌కుమార్‌ శర్మ పేరుతో మరొకటి ఉన్నట్లు వెల్లడైంది. భరత్‌కుమార్‌శర్మ పేరుతోనూ రామచంద్రభారతి చలామణి అయినట్లు గుర్తించారు సిట్‌ అధికారులు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహ యాజీ స్వామీజీల నుంచి స్వాధీనం చేసుకున్న ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్లను సిట్ అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పరీక్షల నిమిత్తం పంపించిన విషయం తెలిసిందే. రామచంద్ర భారతికి సంబంధించిన 2 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ ను స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో కొంత సమాచారాన్ని డిలీట్ చేసినట్టుగా గుర్తించారు. దీంతో ఎఫ్ ఎస్ ఎల్ అధికారులు హార్డ్ డిస్క్ ను రిట్రీవ్ చేసి డిలీట్ చేసిన దానిలో ఉన్న సమాచారాన్ని గుర్తించారు.  

స్పీడ్ పెంచిన సిట్ 

వేర్వేరు పేర్లతో రెండు పాస్‌పోర్ట్‌లను గుర్తించిన అధికారులు.. భరత్‌కుమార్‌శర్మ పేరుతో ఉన్న పాస్‌పోర్ట్‌ ఫోర్జరీది కావచ్చన్న కోణంలో ఆరా తీస్తున్నారు. మరొకరి పేరుతో ఉన్న పాస్‌పోర్టులో మొదటి పేజీని మార్ఫింగ్‌ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయా నంబర్ల ఆధారంగా అవి ఎవరివో తెలుసుకునేందుకు పాస్‌పోర్టు అధికారులకు పోలీసులు లేఖ రాయనున్నారు. రెండూ రామచంద్రభారతివే అయితే.. స్టాంపింగ్‌లను సైతం పరిశీలించనున్నారు. ఈ రెండు పాస్‌పోర్టుల్లోని వివరాల ఆధారంగా అతడు ఎక్కడెక్కడికి ప్రయాణించాడనే కోణంలోనూ వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా ఫాంహౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలు జరుగుతున్న సమయంలో రికార్డ్ చేసిన వీడియోలో ఉన్న వాయిస్ నిందితులది అవునా కాదా? ఇక ఫోన్ కాల్ రికార్డింగ్స్ లో ఉన్న వాయిస్ నిందితులదేనా వంటి విషయాలను తీర్చడం కోసం స్వర నమూనా పరీక్షలను కూడా జరిపించారు. ఇక వీటంన్నిటికీ సంబంధించిన నివేదిక ప్రస్తుతం సిట్ చేతిలో ఉంది. ఈ నివేదిక ఆధారంగా రామచంద్ర భారతి అలియాస్ సతీష్ శర్మకు నకిలీ పాస్ పోర్టు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు సిట్ దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధం ఉందన్నట్టుగా భావిస్తున్న మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులు ఇచ్చింది.

ఇవి కూడా చదవండి   ఫామ్ హౌస్‌ కేసుపై టీఆర్ఎస్ సైలెంట్ - ఎవరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు కేటీఆర్ ఆదేశం!

బండి సంజయ్ అనుచరుడి విచారణ News Reels

 మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ రోజు రోజుకూ దూకుడు పెంచుతోంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిట్ ప్రత్యేక బృందం బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఫామ్ హౌస్ లో ఆరోజు ఏం జరిగింది, అసలు ఎన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం నడుస్తుందన్న దానిపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అటు శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో టెక్నికల్, సైంటిఫికల్ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. ఒకవైపు కమాండ్ కంట్రోల్ సెంటర్లో శ్రీనివాస్ ఇచ్చిన ఆధారాలతో మరొకవైపు అదనపు టీమ్స్ ని ఏర్పాటు చేసి గ్రౌండ్ లెవెల్ నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులు రామ చంద్రభారతి, సింహయాజి, నందకుమార్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పోలీసులు డిలీటెడ్ డేటాను సేకరించే పనిలో పడ్డారు. వారి డేటాను బ్యాకప్ చేయించారని సమాచారం. అలాగే అటు లాప్ టాప్ లో ఉన్న కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏకంగా లక్ష పేజీల ఉండే సమాచారం సిట్ బృందం సేకరించినట్లు తెలిసింది.   

ల్యాప్ టాప్ సీజ్ 

ముఖ్యంగా 7075779637 నంబరుతో కూడిన శామ్ సంగ్ మొబైల్ ను రామచంద్రభారతి వినియోగించారు. ఆ ఫోన్లో 8762090655 వాట్సాప్ నంబరుతో విరివిగా చాటింగ్లు ఉన్నాయి. 9110662741 నంబరుతో కూడిన మరో ఫోన్ దొరికింది. ఫామ్ హౌస్ లో ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం వాటి నుంచి సమాచారం సేకరించడంతోపాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి విశ్లేషించారు. అప్పటికే తొలగించిన డేటాను రికవరీ చేశారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో సమాచారం లభ్యమైంది. ఆ ఫోన్ల నుంచి సునీల్ కుమార్ బన్సల్, బీఎల్ సంతోష్, తుషార్ వెళ్లాపల్లికి పంపిన మెసేజ్ లు ఉన్నాయి. నిందితుడు నందకుమార్ ఫోన్ లో వందల సంఖ్యలో చాటింగ్ లను గుర్తించారు. నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టే విషయంలో ఇద్దరి మధ్య సంభాషణలు ఉన్నాయి. భారతికి చెందిన డెల్ ల్యాప్ టాప్ ను సీజ్ చేశారు. వీటన్నింటినీ విశ్లేషించి పెద్ద ఎత్తున సమాచారాన్ని సేకరించారు