Tollywood Gossips: మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆ టాప్ స్టార్స్

Tollywood Gossips: మెగాస్టార్ చిరంజీవితో  స్క్రీన్ షేర్ చేసుకోనున్న ఆ టాప్ స్టార్స్

హైదరాబాద్: మెగాస్టార్‌ చిరంజీవితో మరో ఇద్దరు టాప్ స్టార్స్ కలిసి నటిస్తున్నారా..? సమంతా నటించిన శాకుంతల చిత్రం రిలీజ్ డేట్ వచ్చేసింది.వీవీ వినాయక్‌కు రూ.500 కోట్లు ఆఫర్ చేసిందెవరు.. ఇటింటి ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం.

టాలీవుడ్‌కు నలుగురు టాప్ స్టార్స్ నాలుగు స్తంభాలుగా ఉన్నారు. వారే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.ఈ నలుగురిలో ముగ్గురు కలిసి ఒకే చిత్రంలో కనిపిస్తే… వింటుంటేనే వావ్ అనిపిస్తోంది కదా.. మరి ఒకే స్క్రీన్‌ను ఈ ముగ్గురు టాప్ స్టార్స్ షేర్ చేసుకుంటే ఇక వారి ఫ్యాన్స్‌కు పండగే.. ఇంతకీ ఈ టాప్ స్టార్స్ ఎవరనేగా మీ డౌటు.. అక్కడికే వచ్చేస్తున్నా.

కాలం మారుతున్న కొద్దీ సినీ అభిమానుల టేస్ట్ కూడా మారుతోంది. ఒకప్పుడు సింగిల్ హీరోనే ఇష్టపడ్డ అభిమానులు ఈ మధ్య కొంత ఛేంజ్ అయ్యారనే చెప్పాలి. మల్టీ స్టారర్ మూవీస్‌ వైపు ఫ్యాన్స్ చూస్తున్నారు. దీంతో అభిమానుల మధ్య విబేధాలు కూడా తొలిగిపోయి సినిమాను సినిమాగానే చూస్తున్నారు.ఇప్పటికే వెంటేష్ పలు మల్టీ స్టారర్ చిత్రాల్లో నటించారు. తాజాగా ఓ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్టేర్ వీరయ్య మూవీలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ నారప్ప తన భాగం వరకు షూటింగ్ కంప్లీట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి.ఇందులో ఓ కామిక్ సీన్‌లో వెంకటేష్ నటిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే వాల్టేర్ వీరయ్య సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఓ అతిథి పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అసలే మన్మధుడు… దీంతో అక్కినేని అందగాడితో ఓ రొమాంటిక్ రోల్ ప్లే చేయిస్తున్నారట ఈ మూవీ డైరెక్టర్ బాబీ.ఈ చిత్రంలో మాస్ మహారాజ్ రవితేజ చిరంజీవికి తమ్ముడిగా నటిస్తున్నాడు. కొన్నేళ్ల కిందట అన్నయ్య చిత్రంలో మెగాస్టార్ బ్రదర్‌గా రవితేజ చేశాడు .వెంకీమామ, నాగ్ చిరంజీవితో కలిసి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకుంటారన్న వార్త నిజమైతే తెలుగు ప్రేక్షకులకు ఇది కచ్చితంగా మాస్ మసాలా ఎంటర్‌టెయినర్‌ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సమంతా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. పుష్పలో ఐటెం నెంబర్ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన ఈ అందాల భామ… త్వరలోనే కనువిందు చేయనుంది. గుణశేఖర్ డైరెక్ట్ చేస్తున్న ఎపిక్ మూవీ శాకుంతల చిత్రంకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. శాకుంతల చిత్రాన్ని ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన విడుదల చేయనున్నట్లు గుణశేఖర్ టీమ్ ట్వీట్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగు హిందీ, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి   కూల్ డ్రింక్ అనుకుని పురుగులమందు తాగిన చిన్నారి.. ఆస్పత్రికి తరలిస్తుండగానే అనంతలోకాలకు!!

నవంబర్‌లో రిలీజ్ కానున్న శాంకుతల చిత్రానికి తెలుగులో మరో చిత్రం పోటీగా ఏదీ విడుదల కావడం లేదు. అయితే హిందీలో మాత్రం కత్రినా కైఫ్ సమంతాకు పోటీగా తన చిత్రం ఫోన్ భూత్‌తో వస్తోంది. అదే సమయంలో అర్జున్ కపూర్ నటించిన కుట్టీ కూడా రిలీజ్‌కు కానుంది. ప్రస్తుతం హీరోయిన్స్ లిస్టులో సమంతా టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక కత్రినా కైఫ్ 8వ స్థానంలో ఉంది. అయితే వీరిద్దరి చిత్రాలు ఒకేసారి విడుదల కానుండటంతో ఎవరు ఎవరికి పోటీగా నిలుస్తారా అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇక ఈ చిత్రం తర్వాత సమంతా యశోధ, ఖుషీ సినిమాల్లో నటిస్తోంది.

స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంతో బిజీగా ఉన్నారు. తెలుగులో ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను…హిందీలో బెల్లంకొండ శ్రీనివాస్‌తో రీమేక్ చేస్తున్నాడు. తెలుగులో అల్లుడు శీను చిత్రంతో బెల్లంకొండ శ్రీనివాస్ అరంగేట్రం చేశాడు. ఈ చిత్రానికి డైరెక్టర్ వీవీ వినాయక్. హిందీలో కూడా ఇదే దర్శకుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇది భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. పెన్ స్టూడియోస్ ఈ హిందీ ఛత్రపతి రీమేక్‌ను నిర్మిస్తోంది. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ వీవీ వినాయక్‌కు మరో బంపర్ ఆఫర్ ఇచ్చిందట. 500 కోట్లతో ఓ పాన్ ఇండియా సినిమాను తీసేందుకు రెడీ అవుతోందట పెన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ. ఈ సినిమాను వీవీ వినాయక్‌ డైరెక్ట్ చేయాల్సిందిగా కోరినట్లు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ మీడియాకు తెలిపారు.

మరో 80 రోజుల్లో ఛత్రపతి హిందీ రీమేక్ షూటింగ్ పూర్తవుతుంది. తెలుగులో కథ అందించిన విజయేంద్ర ప్రసాద్.. హిందీ ఆడియెన్స్‌కు తగ్గట్టుగా కథలో కొంతమేరా మార్పులు చేసినట్లు సమాచారం. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లు ఒరిజినల్ తెలుగు ఛత్రపతి సినిమాకంటే కూడా బాగుంటాయని బెల్లంకొండ సురేష్ చెప్పుకొచ్చారు.ఇక వీవీ వినాయక్‌కు వచ్చిన 500 కోట్ల భారీ బడ్జెట్ సినిమా హిస్టారికల్ డ్రామానా, పీరియాడిక్ మూవీనా, లేదా హై యాక్షన్ సీక్వెన్స్ చిత్రమా అనేది తెలియాలంటే కొంత కాలం వరకు వేచిచూడాల్సిందే.