Valtheru Veerayya: చిరంజీవి మూవీలో టాలీవుడ్ స్టార్.. రవితేజ, వెంకటేష్‌‌తో పాటు ఆయన కూడా!

Valtheru Veerayya: చిరంజీవి మూవీలో టాలీవుడ్ స్టార్.. రవితేజ, వెంకటేష్‌‌తో పాటు ఆయన కూడా!

దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తన హవాను చూపిస్తూ.. టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో కంటే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన వీలైనంత ఎక్కువగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో చిత్రాలను కంప్లీట్ చేసుకుంటూ వచ్చిన ఈ స్టార్ హీరో.. ప్రస్తుతం ఏకకాలంలో పలు ప్రాజెక్టులను చేస్తున్నారు. అందులో కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీ తెరకెక్కిస్తోన్న ‘వాల్తేరు వీరయ్య’ ఒకటి. ఈ సినిమాలో ఎంతో మంది స్టార్ హీరోలు నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో టాలీవుడ్ బడా హీరో పేరు కూడా లీకైంది. ఇంతకీ ఎవరా స్టార్? ఆ సంగతుంలేంటో మీరే చూడండి!

సినిమా పరంగా జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న మెగాస్టార్ చిరంజీవి కొద్ది రోజుల క్రితమే ‘ఆచార్య’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా కీలక పాత్ర చేశాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా రెస్పాన్స్‌ను అందుకోలేక నిరాశ పరిచింది. దీంతో ఈ చిత్రానికి ఏకంగా రూ. 80 కోట్లకు పైగా నష్టాలు వచ్చాయి.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

మెగాస్టార్ చిరంజీవి మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్‌ను ‘గాడ్ ఫాదర్’ టైటిల్‌తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని మోహన్ రాజా రూపొందించాడు. ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కాబోతుంది. దీని తర్వాత తమిళంలో బంపర్ హిట్ అయిన వేదాళం చిత్రాన్ని మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’గా రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీ షూట్ కొంతే పూర్తైంది.

ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు కొడుతోన్న టాలెంటెడ్ డైరెక్టర్‌ కేఎస్ రవీంద్ర అలియాస్ బాబీతోనూ మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కబోతున్నట్లు దర్శకుడు బాబీ ఎప్పుడో తెలిపాడు. అందుకు అనుగుణంగానే ఈ సినిమాలోని కీలకమైన పాత్రలో మాస్ మహారాజా రవితేజ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అతడు షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి   Brahmastra మూవీని ఎందుకు రిజెక్ట్ చేశానంటే.. కారణం చెప్పిన సుధీర్ బాబు

పూర్తి స్థాయి మాస్ అండ్ కమర్షియల్ జోనర్‌లో రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజతో పాటు మరికొందరు స్టార్లు కీలక పాత్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాలో తళుక్కున మెరుస్తారని అంటున్నారు. ఇందులో భాగంగానే విక్టరీ వెంకటేష్‌ ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో చాలా మంది హీరోలు కనిపించే అవకాశం ఉన్నట్లు ముందుగానే చెప్పుకున్నాం. అందుకు అనుగుణంగానే ఈ చిత్రంతో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కూడా భాగంగ కాబోతున్నారట. ఆయన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ మాదరిగానే మరో కీలకమైన గెస్ట్ రోల్‌ను చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మాస్ మహారాజా రవితేజ మరో పాత్రలో రాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో వెంకటేష్, నాగార్జున కూడా నటిస్తున్నారన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే, ఇంత మంది హీరోలు ఉన్నా.. వీళ్లందరూ సింగిల్ ఫ్రేమ్‌లో మాత్రం కనిపించరట. ఒక్కొక్కరు ఒక్కో సీన్‌లో మాత్రమే వచ్చి వెళ్తారని విశ్వసనీయంగా తెలుస్తోంది.