Flights: 18-65 మధ్య పురుషులకు విమాన టిక్కెట్లు బంద్.. ప్రభుత్వం సెన్సేషనల్ నిర్ణయం.. ఎందుకంటే..?

Flights: 18-65 మధ్య పురుషులకు విమాన టిక్కెట్లు బంద్.. ప్రభుత్వం సెన్సేషనల్ నిర్ణయం.. ఎందుకంటే..?
         For Quick Alerts  

       Subscribe Now          

<img data-pagespeed-no-defer="" src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/rice-1663922654.jpg632d96fa82fa4.jpg"></img>  

            For Quick Alerts  

       ALLOW NOTIFICATIONS          

         <img alt="bredcrumb" src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/g_arrow.jpg632d96fa928fa.jpg"></img>

bredcrumb

     |                                                                                     Published: Friday, September 23, 2022, 15:37 [IST]                                     

  Flights: 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు ఉన్న మగవారికి విమాన టిక్కెట్లు అమ్మెుద్దని ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రష్యాలోని విమానయాన సంస్థలకు ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయనే వార్త ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మీడియా వార్తలు వైరల్ కావటంతో.. పుతిన్ నియంతృత్వ పాలనకు ఇది అద్ధం పడుతుందని అనేక మంది మండిపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..

        <img alt="టిక్కెట్ల బ్యాన్.." src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/aeroplane-607-1663927554.jpg632d96fae5740.jpg" title=""></img>   <h2>టిక్కెట్ల బ్యాన్..</h2> రష్యన్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం.. రష్యన్ ఎయిర్‌లైన్స్ 18-65 ఏళ్ల మధ్య వయసున్న రష్యన్ పురుషులకు విమాన టిక్కెట్ల అమ్మకాలు నిలిపివేశాయి. ఉక్రెయిన్‌తో పోరాడేందుకు మరిన్ని దళాలను సమీకరించనున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో ప్రకటించారు. ఈ కారణంగా అక్కడి మగవారిని విదేశాలకు వెళ్లకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందరూ భావిస్తున్నారు.

   <img alt="టర్కిష్ ఎయిర్‌లైన్స్.." src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/flight-02-1663927494.jpg632d96fb3eb33.jpg" title=""></img>

<h2>టర్కిష్ ఎయిర్‌లైన్స్..</h2> రష్యా నుంచి అర్మేనియా, జార్జియా, అజర్‌బైజాన్, కజకిస్తాన్‌లకు నేరుగా నడిచే విమానాల్లో బుధవారం టిక్కెట్లు అన్నీ అమ్ముడయ్యాయని ప్రముఖ రష్యన్ వెబ్‌సైట్ Aviasales తెలిపింది. అదేవిధంగా.. రష్యా నుంచి పొరుగు దేశాలకు ప్రయాణ టిక్కెట్లు పూర్తిగా బుక్ అయినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

<img alt="అనుమతి లేదు.." src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/aeroplane-691-1663927571.jpg632d96fb89a71.jpg" title=""></img>    <h2>అనుమతి లేదు..</h2> రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన యువకులు మాత్రమే దేశం విడిచి వెళ్లడానికి అనుమతించబడతారని తెలుస్తోంది. ఇతరులు దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదు.

<img alt="భారీ సైనిక వ్యూహం.." src="https://paperdabba.com/telugu/wp-content/uploads/sites/5/2022/09/localimages/flight-men-1663927580.jpg632d96fbd6cb9.jpg" title=""></img>    <h2>భారీ సైనిక వ్యూహం..</h2> ఉక్రెయిన్‌తో యుద్ధం తారా స్థాయికి చేరుకోవడంతో 3,00,000 మందిని సైనిక సేవల కోసం పిలవవచ్చని రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు తెలిపారు. కాబట్టి రష్యా నుంచి 18-65 సంవత్సరాల వయస్సు ఉన్న పురుషులు కొంతకాలం విదేశాలకు వెళ్లలేరు. దేశరక్షణకు అవసరమైన సైనికుల కోసం రష్యా ఈ సంచలన నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు చెబుతున్నారు.

          English summary

in russia males of 18-65 age not allowed to fly country aviation companies ordered to stop sell tickets

In russia males of 18-65 age not allowed to fly country aviation companies ordered to stop sell tickets

ఇవి కూడా చదవండి   ఉక్రెయిన్ కు ఆయుధాలివ్వడం కరెక్టే-ఆత్మరక్షణ కోసమేగా-పోప్ సమర్ధన

Story first published: Friday, September 23, 2022, 15:37 [IST]