Brahmastra Collections: తెలుగులో కొన్నిది 5 కోట్లకు.. 2 వారాల్లోనే సంచలనం.. ఏకంగా అన్ని కోట్ల లాభం

Brahmastra Collections: తెలుగులో కొన్నిది 5 కోట్లకు.. 2 వారాల్లోనే సంచలనం.. ఏకంగా అన్ని కోట్ల లాభం

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయిలో అంతకంతకూ పెరుగుతూనే ఉంది. దీంతో దేశంలోని అన్ని ఇండస్ట్రీల కంటే మన మార్కెట్ మీదనే అందరూ ఫోకస్ చేస్తున్నారు. దీంతో తమ తమ చిత్రాలను తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్లు చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఫిల్మ్ మేకర్లు ఈ తరహా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ఇటీవలే తెలుగులో గ్రాండ్‌గా విడుదలైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో విడుదలైంది. దీనికి తెలుగులో భారీ వసూళ్లు దక్కాయి. దీంతో టార్గెట్‌ను చేరుకుని లాభాల బాటలో పయణిస్తోంది. ఈ నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ మూవీ 2 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో చూడండి!

రణ్‌బీర్ కపూర్ – అయాన్ ముఖర్జీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌ కాగా.. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌనీ రాయ్ కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, అపూర్వ మెహతా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. దీనికి సైమన్ ఫ్రాంగ్లెన్, ప్రీతమ్ సంగీతం అందించారు. ఇది హిందీతో పాటు తెలుగులోనూ వైభవంగా విడుదలైంది.

అనసూయ అందాల ఆరబోత: షర్ట్ విప్పేసి.. ప్యాంట్ లేకుండా!

క్రేజీ కాంబోలో హై రేంజ్‌లో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోని హక్కులకు డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే తెలుగులో ఇది రూ. 5 కోట్లు బిజినెస్ చేసుకుంది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ. 200 కోట్ల బిజినెస్‌ను జరుపుకుంది.

భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ మూవీ హిందీ తర్వాత తెలుగులోనే భారీ స్థాయిలో విడుదలైంది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన దక్కింది. దీంతో లాభాలు కూడా వస్తున్నాయి. అయితే, క్రమంగా దీనికి వసూళ్లు పడిపోతోన్నాయి. ఈ నేపథ్యంలో 14వ రోజైన గురువారం ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 7 లక్షలు షేర్‌ను అందుకుంది.

క్లీవేజ్ షోతో బిగ్ బాస్ లహరి రచ్చ: ఆమె డ్రెస్సు, ఫోజులు చూశారంటే!

‘బ్రహ్మాస్త్ర’ మూవీ 2 వారాలకు ఏపీ, తెలంగాణలో సత్తా చాటింది. ఫలితంగా నైజాంలో రూ. 5.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.39 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 1.43 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 93 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 60 లక్షలు, గుంటూరులో రూ. 1.06 కోట్లు, కృష్ణాలో రూ. 63 లక్షలు, నెల్లూరులో రూ. 42 లక్షలతో.. రూ. 12.39 కోట్లు షేర్, రూ. 23.50 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ఇవి కూడా చదవండి   Bigg Boss Telugu 6 Elimination ఛీటింగ్ చేయబోయిన కంటెస్టెంట్ అవుట్.. హిస్టరీలో బిగ్‌బాస్ సంచలన నిర్ణయం

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన ‘బ్రహ్మాస్త్ర’కు అంచనాలకు అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 5.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 5.50 కోట్లుగా నమోదైంది. ఇక, 14 రోజుల్లో దీనికి భారీ స్థాయిలో రూ. 12.39 కోట్లు వచ్చాయి. అంటే హిట్ స్టేటస్‌తో పాటు రూ. 6.89 కోట్లు లాభాలు దక్కాయి.

దీప్తి సునైనా హాట్ సెల్ఫీ: స్లీవ్‌లెస్ టాప్‌లో ఎద అందాల ఆరబోత

ఏపీ, తెలంగాణలో లాభాలు కొట్టిన ‘బ్రహ్మాస్త్ర’.. ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. దీనికి 2 వారాల్లో హిందీలో రూ. 215.82 కోట్లు, తెలుగులో రూ. 28.98 కోట్లు, తమిళంలో రూ. 9.06 కోట్లు, కర్నాటకలో రూ. 15.18 కోట్లు, కేరళలో రూ. 2.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 99.50 కోట్లు రాబట్టింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ. 371.30 కోట్లు గ్రాస్‌ కలెక్ట్ చేసింది.