Bigg Boss Telugu 6: గీతూ రాయల్ ను పంపించేయండ్రా.. ఆమెకు ఓట్లు వేయకండ్రా బాబు..

Bigg Boss Telugu 6: గీతూ రాయల్ ను పంపించేయండ్రా.. ఆమెకు ఓట్లు వేయకండ్రా బాబు..

బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ మంచి రసవత్తరంగా సాగుతోంది. అరుపులు, కేకలు, గొడవలు, బూతులతో రంజుగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో మూడో వారం కెప్టెన్సీ కంటెడర్ల టాస్క్ నడుస్తోంది. ఈ టాస్క్ లో గీతూ రాయల్, ఆది రెడ్డి, శ్రీ సత్య, ఫైమా, శ్రీహాన్ పాల్గొన్నారు. వీరిలో ఫైమా, గీతూ రాయల్ డిస్ క్వాలిఫై కాగా మిగతా వారు సెకండ్ లెవెల్ లోకి వెళ్లారు. ఇదిలా ఉంటే ప్రతి సీజన్ లో బిగ్ బాస్ హౌజ్ లో కంటెస్టెంట్ల ఆట తీరుపై మాజీ కంటెస్టెంట్ల అభిప్రాయాలను బీబీ కేఫ్ అంటే బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయట పెడతారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేఫ్ కు హోస్ట్ గా అరియానా గ్లోరీ వ్యవహరిస్తోంది.

బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ కంటెస్టెంట్ల ఆట తీరుపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇందు కోసం ప్రస్తుతం ఆరో సీజన్ లో ఆడుతున్న కంటెస్టెంట్ల ఆట తీరుపై గత సీజన్ లోని కంటెస్టెంట్ల అభిప్రాయాలను బిగ్ బాస్ కేఫ్ ద్వారా బయటపెడతారన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేఫ్ కు బిగ్ బాస్ నాలుగు అండ్ ఐదో సీజన్ కంటెస్టెంట్, యాంకర్ అరియానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరిస్తోంది.

ఈ కేఫ్ కు వచ్చే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్లు ప్రస్తుత ఇంటి సభ్యులపై అభిప్రాయాలు చెబుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఈ కేఫ్ కు మోడల్ జెస్సీ అలియాస్ జశ్వంత పడాల హాజరయ్యాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగానే గీతూ రాయల్, రేవంత్, శ్రీహాన్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు జెస్సీ.

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా ఆడించిన అడవిలో ఆట గేమ్ లో రేవంత్ ను గెలవనివ్వకూడదని బొమ్మలు దాచిపెట్టడం వరెస్ట్ థింగ్ అని చెప్పుకొచ్చాడు జెస్సీ. అలాగే గీతూ రాయల్ గురించి ప్రస్తావిస్తూ.. ఓయమ్మా.. ఎవరైనా ఆమెను పంపించేయండ్రా.. ఆమెకు ఓట్లు వేయకండ్రా బాబు.. అని పోస్ట్ పెడదామనుకున్నా అని షాకింగ్ విషయం తెలిపాడు.

ఇక ప్రస్తుతం హౌజ్ లో వరెస్ట్ కంటెస్టెంట్ ఎవరని అరియానా గ్లోరీ అడగ్గా.. రాజ్ అని సమాధానమిచ్చాడు జెస్సీ. ఎందుకు.. కెప్టెన్ కూడా అయ్యాడు అని అరియానా అనగా అతను కెప్టెన్ అయిన విధానం తనకు నచ్చలేదని చెప్పుకొచ్చాడు జెస్సీ. రేవంత్ ఫ్రెండ్ అంటూ శ్రీ సత్య దగ్గర వాడో పెద్ద నసగాడు అని మాట్లాడతాడని అర్జున్ గురించి చెప్పాడు.

ఇవి కూడా చదవండి   8 Years For Aagadu: సినిమా ఫ్లాప్ అయినా ఓపెనింగ్స్ రికార్డులు మాత్రం నెవ్వర్ బిఫోర్.. మహేష్ కెరీర్ బెస్ట్!

ఒక నెగెటివ్ బ్యాగ్ తో ఆరోహి ఉంటుందని ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇక ఆదిరెడ్డి గురించి అడగ్గా.. బాబాయ్.. నిన్న ఒక్క రోజే ఓపెన్ అయ్యాడు అన్న జశ్వంత్ పడాల.. గీతూ రాయల్, శ్రీహాన్, రేవంత్ ఈ ముగ్గురే గేమ్ ఆడుతున్నట్లు కనిపించారని తెలిపాడు. కాగా బిగ్ బాస్ ఐదో సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు జశ్వంత్ పడాల. మోడలింగ్ రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్న జెస్సీ పలు కార్పొరేట్ యాడ్స్ లలో నటించాడు.

2018లో సూపర్ మోడల్ ఇండియా టైటిల్ గెలుచుకున్న జెస్సీ 36 గంటలు ర్యాంప్ వ్యాక్ చేసి రికార్డు నెలకొల్పాడు. అలాగే సూపర్ మోడల్ ఇండియా, బ్లెండర్ స్ప్రైడ్ మిస్టర్ ఫ్యాషనబుల్ ఐకాన్, ఐఎఫ్ఎల్ మోడల్ ఆఫ్ ఇయర్ 2021 ఇలా చాలా టైటిల్స్ సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా జెస్సీని ఫ్యాషన్ రంగంలో మిలింద్ సోమన్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలుస్తారంట.