PaperDabba News Desk: 25 september 2024
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి తనపై వచ్చిన రేప్ ఆరోపణలపై స్పందించాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, డబ్బు కోసమే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.తన వ్యక్తిత్వం గురించి ప్రజలకు తెలిసిందేనని, త్వరలోనే ఈ కేసుకు సంబంధించిన అన్ని నిజాలు బయటకు వస్తాయని తెలిపారు. తనపై వస్తున్నా ఆరోపణలు నమ్మొద్దని, అవన్నీ అసత్య ప్రచారాలని హర్ష సాయి ట్వీట్ చేసారు.
బాధితురాలి ఆరోపణలు
బాధితురాలు చేసిన ఫిర్యాదులో కొన్ని కీలక అంశాలు వెలుగుచూశాయి. బాధితురాలు నిర్మాతగా వ్యవహరించిన ‘మెగా’ సినిమాకు సంబంధించిన కాపీ రైట్స్ హర్ష సాయి తనకు ఇవ్వాలని బలవంతం చేసాడని, అందుకు నిరాకరించడంతో , ఆమెపై మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డాడని, ఆ సమయంలో వీడియోలు తీసి, కాపీరైట్స్ ఇవ్వకపోతే వీడియోలను వైరల్ చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది.తనకు ప్రాణహాని ఉందని, హర్షసాయిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
హర్ష సాయి అరెస్ట్
హర్షసాయిని ఈ రోజు పోలీసులు బెంగుళూరులో అరెస్ట్ చేసారు.
హర్షసాయి కేసు చుట్టూ ఉన్న సందేహాలు, ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రాకముందు, ఈ సంఘటనపై భిన్న అభిప్రాయాలు నెలకొన్నాయి.