PaperDabba News Desk: July 14, 2024
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడు మరియు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై జరిగిన కాల్పుల ఘనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో అయన స్పందిస్తూ, “గాయపడిన తన స్నేహితుడు ట్రంప్ త్వరగా కోలుకోవాలని” ఆకాంక్షించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, రాజకీయాల్లో మరియు ప్రజాస్వామ్యంలో హింసకు ఎటువంటి స్థానం లేదని మోదీ అన్నారు.
కాల్పుల ఘనపై ప్రధాని మోదీ స్పందన
ట్రంప్ పై జరిగిన కాల్పులు గురించి తెలిసిన వెంటనే, ప్రధాని మోదీ అతని ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. “నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను,” అని మోదీ అన్నారు. “ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి మరియు సామాన్య ప్రజల నమ్మకానికి ముప్పు.” అని చెప్పారు.
కాల్పుల ఘటన వివరాలు
ఈ ఘటనను హత్యాయత్నంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అమెరికా పోలీసులు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… ట్రంప్ చెవి నుండి రక్తస్రావం అవుతుందని తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
దుండగుడి చర్య
ట్రంప్ కు అతి దగ్గర నుంచే కాల్పులు జరిపాడు దుండగుడు. అనుమానాస్పద షూటర్ ను చంపినట్లు కూడా అధికారులు తెలిపారు. దగ్గరలోని ఓ ఇంటి పైకప్పు నుండి ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు.
గాయపడిన తన స్నేహితుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.