PaperDabba News Desk: 21 July 2024
ఆముదాలవలస నియోజక వర్గ ఎమ్మెల్యే, మాజీ శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షులు కూన రవికుమార్ కి త్వరలో టీటీడీ చైర్మన్ పదవీ బాధ్యతలు అప్పజెప్పనున్నారు అని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా, రాజకీయ వర్గాల్లో చర్చలు హోరెత్తుతున్నాయి.
కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ బాధ్యతలు?
కూన రవికుమార్ టీడీపీకి కీలక నాయకుడిగా పేరొందారు. ఆయన ఆముదాలవలస నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా సేవలందించారు. కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ బాధ్యతలు అప్పజెప్పడంపై ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. టీటీడీ చైర్మన్ పదవీకి తగిన అనుభవం, సామర్ధ్యం ఆయనకున్నాయని పలువురు నేతలు పేర్కొంటున్నారు.
కాళింగ సామాజిక వర్గానికి న్యాయం?
రాష్ట్ర మంత్రి మండలిలో కాళింగ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందని ఆ వర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ అప్పగించడం ద్వారా ఆ వర్గానికి కొంతమేర న్యాయం జరగవచ్చని భావిస్తున్నారు.
చరిత్రలోకి ఒకసారి చూద్దాం
గతంలో ఆమదాలవలస ఎమ్మెల్యేగా మూడుసార్లు గెలిచిన పైడి శ్రీరామ్మూర్తి తండ్రి పైడి నరసింహా అప్పారావు పాలకొండ ఎమ్మెల్యేగా ఎన్నికై, కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీటీడీ బోర్డు లైఫ్ టైం ఛైర్మన్ గా మూడుసార్లు చేశారు. ఈయన జన్మస్థలం పొందూరు మండలం కింతలి గ్రామం.
కూన రవికుమార్ కి టీటీడీ చైర్మన్ పదవీ బాధ్యతలు అప్పజెప్పడం కాళింగ సామాజిక వర్గానికి ఎంతో సంతోషం కలిగిస్తుంది అని ఆశిస్తున్నారు. ఈ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరాలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.