PaperDabba News Desk: 2024-07-23
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు కేటాయించిన NDA ప్రభుత్వానికి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కీలక నిధులు అమరావతి అభివృద్ధికి తొలి అడుగు పడినట్లే. దీనితో 6 కోట్లే ఆంధ్రుల రాజధాని కల నిజమైయ్యే రోజు దగ్గలోనే ఉందని ఆశాభావం వ్యక్తమౌతోంది.
ప్రత్యేక కేటాయింపులకు గౌరవం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్‌లోని ప్రత్యేక సదుపాయాలు ఆంధ్ర ప్రదేశ్‌కు ఉన్నాయని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించినందుకు కూడా అయన కృతజ్ఞతలు తెలిపారు.
వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు
ఈ వెనుకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపు, సమగ్ర ప్రాంతీయ అభివృద్ధికి NDA ప్రభుత్వ కట్టుబాటు సూచిస్తుంది. ఈ చర్య ప్రాంతీయ జనాభా జీవిన ప్రమాణాలను మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలు, విద్య మరియు ఉపాధి అవకాశాల్లో ముఖ్యమైన అభివృద్ధులను సాధించాడని ఎంతో గానో ఉపయోగపడుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ కోసం ప్రధాన మంత్రి దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర సర్వత్ర అభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
అమరావతి నిర్మాణానికి భారీ నిధులు
అమరావతి నగర నిర్మాణానికి కేటాయించిన భారీ నిధులు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న శ్రద్ధను తెలియజేస్తుంది.ఈ కేటాయిపులతో రాజధాని నిర్మాణం మొదలైతే రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించి, అలాగే రాష్ట్ర యువతకు అనేక ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుంది.
అమరావతి అభివృద్ధి మరియు వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలకు NDA ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి పై ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది.