పేపర్డబ్బా న్యూస్ డెస్క్ – జూలై 1, 2024
ఆదివారం అయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు నిధులు వస్తున్నా … భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలకు నిధుల విడుదలలో ఆసక్తి చూపడం లేదని, ఇది సరికాదని అయన అన్నారు. తాముకూడా ఈ విధంగానే వ్యవహరిస్తే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమౌతుందా ? అన్నారు. నిజంగానే ఎంపీ లకు నిధులు ఇవ్వకపోతే వారు ఏమి చేయగలరని ప్రశ్నించారు. ప్రజలు నమ్మి ఓటువేసి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వక పోవడం వారిని అవమానించడమేనని రేవంత్ రెడ్డి పై బండి సంజయ్ మండిపడ్డారు.
గత ఎన్నికల్లో కేసీఆర్ పై ప్రజల తిరుగుబాటును చూశారు . అదే పరిస్థితి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కి కూడా వస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు . అందరికి సమానమైన నిధులు కేటాయించి ఇవ్వాలని అయన డిమాండ్ చేశారు. అలాగే సింగరేణి విషయంలో కూడా గత ప్రభుత్వం మాదిరే నడుచుకుంటుందని విమర్శించారు.
తెలంగాణలో పవన్ కళ్యాణ్ జనసేన పొత్తుపై స్పందించారు అయన. దీనిపై అధిష్ఠానం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. దీనికి సంబంధిచి కిషన్ రెడ్డి మరియు జేపీ నడ్డా అలోచించి నిర్ణయం తీసుకుంటారని సంజయ్ తెలిపారు. ఈ విషయం తన పరిధిలోనిది కాదన్నారు. కావున నేను వ్యాఖ్యానించలేనని తెలిపారు.
బండి సంజయ్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్లపై ఆయన చేసిన ఆరోపణలు నిజంగా రాష్ట్రంలో రాజకీయ స్వచ్ఛత అవసరాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రాబోయే ఎన్నికలలో ఈ ఆరోపణలు ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.
SEO Keywords:
కాంగ్రెస్, బీఆర్ఎస్లపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Leave a comment