PaperDabba News Desk: 20 July 2024
తెలంగాణ ముఖ్యమంత్రి ఇటీవల అధికారులతో కలిసి స్కిల్ యూనివర్సిటీ స్థాపనపై సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు కొన్ని సలహాలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ, హర్యానా తరహాలో స్కిల్ యూనివర్సిటీకి ముసాయిదా సిద్ధం చేయడం, ఈ సమావేశంలో ఆ ముసాయిదాను సమీక్షించడం జరిగింది.
సీఎం, డిప్యూటీ సీఎంలు చేసిన కీలక సూచనలు
ముసాయిదాలోని అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ రంగాలకు సంబంధించి సర్టిఫికేషన్, డిప్లొమా కోర్సులు ఉంటాయని సూచించారు. ఈ కోర్సులు, వృత్తి రంగంలో అవసరమైన నైపుణ్యాలు ఇవ్వాలని సూచించారు.
అత్యంత డిమాండ్ ఉన్న రంగాలపై దృష్టి
యూనివర్సిటీలో అందించబోయే కోర్సుల వివరాలను అధికారులు వివరించారు. అత్యంత డిమాండ్ ఉన్న రంగాలకు సబంధిచి కోర్సులను ప్రవేశపెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు.
సంస్థాగత నిర్మాణం మరియు ప్రణాళికలు
యూనివర్సిటీ సంస్థాగత నిర్మాణంపై సీఎం పలు కీలక సూచనలు చేశారు. శిక్షణ పూర్తయిన విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అన్నారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ముందుగానే చర్చలు జరపాలని సూచించారు.
నిధుల మరియు వనరుల విషయాలు
స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై నిధుల విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టం చేశారు. పూర్తిస్థాయి ముసాయిదా సిద్ధం చేయాలని అధికారులను అయన ఆదేశించారు.