మాజీ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు సీఐడీ అధికారులు. వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణం విచారణ లో భాగంగా ఈ నోటీసులను జారీ చేశారు. బోగస్ ఇన్వాయిస్ లను సృషించి వస్తువులు సరఫరా చేయకుండా అవినీతికి పాల్పడ్డారని సోమేశ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు అధికారులకు కూడా నోటీసులు పంపారు. వీరి స్టేట్మెంట్ లను త్వరలోనే రికార్డు చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎ5 గా సోమేశ్ కుమార్ పేరు చేర్చారు. ఏ 1 గా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ విశ్వేశ్వర రావు, ఏ 2 గా అడిషనల్ కమిషనర్ శివరామ్ ప్రసాద్, ఏ 3 గా ప్రొఫెసర్ శోభన్ బాబు, ఏ 4 గా ఫియంటో టెక్నాలజీ ఉన్నారు.